నాగ చైతన్య హీరోయిజాన్ని పక్కన పెట్టేస్తున్నాడు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, అభిమానుల అంచనాలు అనే దాని గురించి పట్టించుకోకుండా.. పాత్రలు మారిపోతున్నాడు. అక్కినేని వారసుడు అనే ఇమేజ్ తాలూకా ఛాయలు కనిపించకుండా.. కొత్త దారిలో వెళ్తున్నాడు చైతన్య. 

 

నాగచైతన్య సినిమా అనగానే అక్కినేని అభిమానుల్లో బోల్డన్ని అంచనాలుంటాయి. చైతన్యని ఒక రేంజ్ లో చూడాలని ఆశపడుతుంటారు. కానీ చైతన్య మాత్రం ఈ అంచనాలను పట్టించుకోవడం లేదు. హీరోయిజం ఇమేజ్ వైపు వెళ్లకుండా, కథలకు తగ్గట్టు పాత్రలా మారిపోతున్నాడు. హీరోయిన్ డామినేటింగ్ స్టోరీస్ లోనూ నటిస్తున్నాడు చై. 

 

మజిలీ సినిమా హీరో క్యారెక్టర్ అంటే.. హీరోయిన్ పాత్రకే ప్రాధాన్యం ఎక్కువ. సమంతది డామినేటింగ్ క్యారెక్టర్. కానీ చైతన్య మాత్రం హీరోయిన్ కు అధిక ప్రాధాన్యమున్నా సరే కథలో భాగమయ్యాడు. మజిలీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల లవ్ స్టోరీలో కూడా ఇలాగే కనిపిస్తున్నాడు చైతన్య. 

 

శేఖర్ కమ్ముల లవ్ స్టోరీలో నాగచైతన్య మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. పెద్దగా బిల్డప్పులు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సాధారణ హీరో పాత్ర పోషిస్తున్నాడు. ముద్దుపెడితే ఎవరైనా ఏడుస్తారా అబ్బా.. అనే డైలాగ్ తో నాగచైతన్య పాత్ర ఎంత సాదాసీదాగా ఉంటుందో చెప్పేశాడు శేఖర్ కమ్ముల. సో చైతన్య సినిమాల లిస్ట్ చూస్తుంటే.. ఈ హీరో హీరోయిజాన్ని పక్కనపెట్టేసినట్టే కనిపిస్తోంది. 

 

అక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా  చూసేందుకు జనాలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. థియేటర్లకు క్యూ కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. రాబోయే సినిమాల్లో హీరోయిజాన్ని పక్కన పెట్టేసి కొత్తగా ట్రై చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. చూడాలి మరి ఆయన ప్లాన్స్ ఎలా వర్కవుట్ అవుతాయో..!

మరింత సమాచారం తెలుసుకోండి: