లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ కెరీర్ ప్రారంభంలో దారుణమైన ఫ్లాపులను మూటగట్టుకుంది. కానీ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ 'గబ్బర్ సింగ్' తో ఒక్కసారిగా స్టార్ తిరిగి స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయింది. 'రేసుగుర్రం'.. 'శ్రీమంతుడు' లాంటి సినిమాలతో టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది. కెరీర్ మాంచి ఊపు మీద ఉన్న సమయంలో ప్రియుడు మైఖేల్ కోర్సలే తో ప్రేమాయణం.. లండన్ లో సింగర్ గా కెరీర్ కోసం ప్రయత్నం చేయడంతో సౌత్ లో చాలా సినిమాలకు దూరమైంది. ఆ సమయంలో శృతి నటించిన సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ కావడంతో శృతి క్రేజ్ కూడా బాగా తగ్గిపోయింది.

 

అయితే కోర్సలేతో ప్రేమాయణం అనుకున్నట్టుగా సాగకపోవడంతో బ్రేకప్ చెప్పేసి కుదురుగా తిరిగి ఇండియాకు వచ్చేసింది. మళ్ళి మన తెలుగు సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి సినిమా 'లాబం' లో నటిస్తోంది. తెలుగులో రవితేజ-గోపిచంద్ మలినేని సినిమా 'క్రాక్' లో కూడా హీరోయిన్ ఆఫర్ వచ్చింది. అయితే శృతికి గతంలో దక్కించుకున్నట్టుగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోతోంది. అంతేకాదు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను క్రేజీ ప్రాజెక్టులలో కూడా శృతి హాసన్ పేరును కనీసం పరిశీలించడం కూడా లేదని తాజా సమాచారం.

 

ఇక టాలీవుడ్ లో చూసుకుంటే శృతి హాసన్ దాదాపు గా ఫేడ్ అవుట్ అయినట్టేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రవితేజ సినిమా తప్ప శృతికి తెలుగులో మరో ఆఫర్ లేదు. ఇక రవితేజ 'క్రాక్' కూడా అంత క్రేజీ ప్రాజెక్ట్ కాదు. గతంలో ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్టుగా ఉండే రవితేజ సినిమాలు ఇప్పుడు కనీసం డీసెంట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించలేక ఘోరంగా దెబ్బతింటున్నాయి. ఈ మధ్య వచ్చిన డిస్కోరాజా సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. దాంతో శృతి కెరీర్ ఎక్స్‌పైరీ డేట్ లా అవుట్ డేటెడ్ హీరోయిన్ అనిపించుకుంటున్నట్టు తయారైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: