భారీ మల్టీ స్టారర్ మూవీ rrr ను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తూ.. మల్టీ స్టారర్ పాత్రలలో  కొమరం భీమ్‌ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తోన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ లో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక విషయం రోజూ బయటికి వస్తూనే.. నిత్యం సోషల్ మీడియా లో హల్.. చల్ చేస్తూ  ఉంటుంది. అయితే.. తాజాగా ఇండస్ట్రీలో ఒక రూమర్ వినిపిస్తోంది. 

 

 

అది ఏంటంటే..  ఎన్టీఆర్ ఈ సినిమాలో పులితో ఫైట్ చేస్తారట. కానీ.. పులితో ఫైట్ అంటే ‘మన్యం పులి’లో మాదిరిగా గ్రాఫిక్స్ కాదట.. నిజం పులితోనే ఎన్టీఆర్ ఫైట్ చేస్తారని అంటున్నారు. దీనికోసం ఇప్పటికే ఆయన ట్రైనింగ్ కూడా తీసుకున్నారని అంటున్నారు. ప్రొఫెషనల్ ట్రైనర్ సారథ్యంలో నిజం పులితో ఎలా ఫైట్ చేయాలో ఎన్టీఆర్ నేర్చుకున్నారట. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి ఇలా నిజం పులితో ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్నారని అంటున్నారు. 

 

 

అయితే, ఇంత రిస్క్ చేయడం అవసరమా అని ప్రశ్నించేవాళ్లు కూడా ఉన్నారు. కానీ, ఈ పులితో ఫైట్ సీన్‌‌ తో కొమరం భీమ్ పరిచయం ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. మరో వైపు, ఇటు రామ్ చరణ్ అభిమానులతో పాటు.. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిత్ర అప్‌ డేట్స్ కోసం వేచి చూస్తున్నారు. చిత్ర విడుదల తేదీని మారుస్తూ ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 

 

 

కాగా., వచ్చే ఏడాది జనవరి 8న RRRను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేక్షకులకు మంచి క్వాలిటీతో కూడిన సినిమాను అందించడానికి తాము సమయం తీసుకుంటున్నట్టు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అయితే, అప్పటి వరకు సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ ఇస్తూ ఉంటామని వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: