సినిమా షూటింగ్ లో ఫైటింగ్ అంటే చాలా హంగామా ఉంటుంది. హీరో కి ఏ ఇబ్బంది లేకుండా డూప్ లతో ఫైటింగ్ కానిచ్చేస్తుంటారు. ఇదంతా సర్వ సాధారణం. డూపు లేకుండా ఫైటింగ్ చేసేందుకు ఏ హీరో ను ముందుకు రాలేని పరిస్థితి ప్రస్తుత తెలుగు ఇండ్రస్ట్రీ లో ఉంది. కాకపోతే కొంతమంది యంగ్ హీరోలు మాత్రం అవేవి పట్టించుకోకుండా ఎటువంటి డూప్ అవసరం లేకుండా చేసేందుకు వెనుకాడరు. ఆ విధంగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ rrr కోసం చాలా రిస్క్ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. 


సినిమా స్టోరీ లో భాగంగా పులితో ఎన్టీఆర్ ఫైట్ చేయాల్సి ఉండటంతో ఈ మేరకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసింది. అయితే ముందుగా గ్రాఫిక్స్ తో చేద్దామని భావించారు. ఎన్టీఆర్ మాత్రం తాను నిజమైన పులి తోనే ఫైట్ చేస్తాను అంటూ చెప్పడంతో ఈ మేరకు ఆయనకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారు. ప్రొఫెషనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో నిజమైన పులితో ఎలా ఫైట్ చేయాలి అనే దానిపై ఎన్టీఆర్ శిక్షణ తీసుకుంటున్నారు. రొటీన్ గా కాకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఎన్టీఆర్ ఈ విధంగా నిజమైన పులితో తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


 ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కు సంబంధించి వచ్చే అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఎనిమిదో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఊహించని విధంగా స్టోరీ, ఫైట్స్, సాంగ్స్ ఉండబోతున్ ట్లు తెలుస్తోంది. బాహుబలి రేంజ్ లో ఈ సినిమా నిర్మించేందుకు జక్కన్న సిద్ధమవుతున్నాడు. ప్రతి సీన్ జాగ్రత్తగా నిర్మిస్తున్నకారణంగా ఈ ఈ చిత్రం షూటింగ్ కి సమయం ఎక్కువ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: