మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కోసం అనుకున్న స్క్రిప్ట్ ఇంకో హీరో కి షిఫ్టవ్వడం రెగ్యులర్ గా చూస్తున్నదే. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్క్రిప్ట్.. 'రెడ్' స్టార్ రామ్ కి షిఫ్టయ్యిందన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో బాబి పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కంప్లీటయ్యాక బాబి...పూరి జగన్నాథ్ లతో పవన్ సినిమాలు చేయడానికి పవన్ ఆసక్తిగా ఉన్నారని టాక్ నడిచింది. పవన్ 29వ సినిమా బాబితోనూ.. 30వ సినిమాని పూరితో చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయం పై మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.

 

'సర్ధార్ గబ్బర్ సింగ్' ఫేం బాబి ఇటీవలే పవన్ ని కలిసి లైన్ వినిపించాడట. కానీ ఆ లైన్ పవన్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదని.. దీంతో బాబిని హోల్డ్ లో పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యం లో అదే లైన్ ని ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి బాబీ వినిపంచాడట. ఆ లైన్ రామ్ కి విపరీతంగా నచ్చి బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడని సమాచారం. ఇక రామ్ ఇస్మార్ట్ శంకర్ సక్సస్ తో కెరీర్ పరంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. వరుసగా ఫ్లాప్ చూసిన రామ్ కి మాంచి కిక్ ఇచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఆ ఊపుతో కథలు.. దర్శకుల ఎంపికలో ఇప్పుడు ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడట.

 

కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వకుండా రెండు మూడు సినిమాల అనుభవం, సక్సెస్ ఉన్న దర్శకులకే ఛాన్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' సినిమాలో నటిస్తున్నాడు రామ్. అన్ని అనుకున్నట్లు గనుక జరిగితే బాబి సినిమా రెడ్ తర్వాత పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సన్నిహిత వర్గాల ద్వారా అందిన సమాచారం. మరి బాబి బౌండెడ్ స్క్రిప్ట్ తో ఇస్మార్ట్ రామ్ ని మెప్పించి ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటా అన్నది బాబి చేతిలోనే ఉంది. ఇక రీసెంట్ గా విక్టరీ వెంకటేష్-నాగ చైతన్య లతో వెంకీ మామ తీసి సక్సస్ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: