రాజకీయాల తో పాటుగా సినిమాల్లో కూడా బిజీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడానికి సిద్దమవుతున్నారు. రాబోయే రెండు మూడు ఏళ్ళలో ఎన్ని సినిమాలు అయితే అన్ని సినిమాలు చెయ్యాలని భావిస్తున్నాడు పవర్ స్టార్. దీనితో దర్శక నిర్మాతలో పవన్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆయనతో సినిమా చేయడానికి ఎక్కువ గానే  కష్టపడుతున్నారని అంటున్నారు. వచ్చే ఏడాది పవన్ డేట్స్ కోసం ఇప్పటి నుంచే దర్శక నిర్మాతలు క్యూలో నిలబడుతున్నారని వార్తలు వస్తున్నాయి.  

 

పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాల విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తలే తీసుకుంటున్నారు. గతంలో ఆయనకు ఫ్లాప్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దాని నుంచి బయటపడే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. హిట్ దర్శకులతో సినిమాలు చేసేందుకు గాను ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే క్రిష్ సహా పలువురు హిట్ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు పవన్. ఇక ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఒక స్టార్ దర్శకుడితో ఆయన చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఆ స్టార్ దర్శకుడు ఇప్పుడు మెగా ఫ్యామిలీలోనే సినిమా చేస్తున్నాడని, వచ్చే ఏడాది ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. ఆ సినిమాను వచ్చే ఏడాది దసరా లేదా జూలైలో విడుదల చేసే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకున్నారట. 2022 వస్తే మళ్ళీ రాజకీయాల్లో తాను బిజీ అయిపోయే అవకాశ౦ ఉంది కాబట్టి పవన్ ఇప్పుడు ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా సినిమాలు చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పింక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మరో రెండు మూడు నెలల్లో విడుదల కూడా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: