గోవా... దేశం లో ఉన్న అత్యంత రద్దీ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి గా చెప్తారు. ప్రపంచ వ్యాప్తం గా కూడా గోవా కు పేరుంది. దేశం లో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారు. దీనితో నిత్యం గోవా రద్దీ గానే ఉంటుంది అనే విషయం తెలిసిందే. యువత ముఖ్యం గా గోవా వెళ్ళాలి అని భావిస్తూ ఉంటుంది. దీనికి తోడు ఎన్నో సినిమాలకు సంబంధించిన  షూటింగ్ లు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. అందుకే అక్కడ క్రేజ్ ఎక్కువ. ఇక విదేశీ పర్యాటకులు కూడా గోవాకు ఎక్కువగా వస్తూ ఉంటారు. 

 

ఈ నేపధ్యంలో గోవాలో కలుషిత వాతావరణం కూడా ఎక్కువగానే ఉంటుంది అనే విమర్శలు ఉన్నాయి. మన దేశంలో సినిమా షూటింగ్ లు ఎక్కువ‌గా జ‌రిగే స‌ముద్ర తీర ప్రాంతాల్లో గోవా చాలా కీలకం.  అయితే ఇప్పుడు అక్కడి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి గోవాలో షూటింగ్ చేయ‌డం కాస్త కష్టమైంది ప్రభుత్వ నిర్ణయం తో అంటున్నారు. గోవా రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం సినిమా షూటింగ్‌ల‌కు ఇప్పుడు ఇబ్బంది గా మారింది అనే చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని కారణాలతో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 

 

ఎవ‌రైనా గోవాలో షూటింగ్‌లు జ‌రుపుకోవాలంటే స్ర్కిప్ట్‌ను ఎంట‌ర్‌టైన్‌మెంట్ సోసైటీ ఆఫ్ గోవా సంస్థ‌కు అందించడం అనేది ఇక నుంచి తప్పనిసరి చేసారు. ఆ అధికారులు స్క్రిప్ట్ చూసి తమకు సినిమా ఓకే అనుకుంటే సినిమా షూటింగ్ చేసుకోవ‌చ్చున‌ని గోవా ముఖ్యమంత్రి ప్ర‌మోద్ సావంత్ తాజాగా ఒక కీలక ప్రకటన చేసారు. ఈ మధ్య చాలా సినిమాల్లో గోవాను మాద‌క ద్ర‌వ్యాలు ల‌భించే కేంద్రంగా చూపిస్తున్నార‌ని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. దీనితో తమ రాష్ట్ర గౌర‌వం దెబ్బ తింటోంద‌ని అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. .

మరింత సమాచారం తెలుసుకోండి: