పవన్ కళ్యాణ్ ...చాలా సింపుల్ గా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ఈ పేరులో ఉంది అసలు పవర్. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు పవర్ స్టార్ అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే ఈ రంగుల ప్రపంచంలో ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఎంత మంది సపోర్ట్ ఉన్నా నిరూపించుకోవాల్సింది మాత్రం హీరోనే. అదే చేశాడు పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడిగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యారు. ఒక్కో సినిమాకి తన టాలెంట్ తో సత్తాని నిరూపించుకుంటూ ఎవరెస్ట్ శిఖరం లా ఎదిగాడు. మెగాస్టార్ ప్రమేయం లేకుండానే అద్భుతమైన కథలని ఎంచుకుంటూ తన సొంత నిర్ణయాలతో తన చుటూ ఒక సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు.

 

తొలిప్రేమ, ఖుషీ, బద్రి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డ్ లను సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. బుర్ర నిండా క్రియోటివిటి ఉన్న పవన్ సొంతగా కథ రాయగలడు. పుస్తక పరిజ్ణానం అపారం. అయన శైలికే ఎవరైనా ఆయనకి ఫాలోవర్స్ గా మారిపోవాల్సిందే. కాంట్రవర్సీలకి ఆమడ దూరం. అన్నలని అంటే కోపం కేరటం లా ఎగిసి పడుతుంది. తన అభిమానులని చిన్న మాట అన్న ముక్కుసూటిగా సమాధానం చెప్పగలిగే నైజం. జనసైనికులకోసం ప్రాణం ఇచ్చే మనస్తత్వం ...ఇలాంటి పవర్ స్టార్ పవర్ లో చాలా ఉన్నాయి.

 

అయితే ఇదంతా నాణేనానికి ఒకవైపు మాత్రమే. అదే నాణేనాన్ని తిరగేసి చూస్తే అదే పవర్ స్టార్ లో ఒక పసిపిల్లాడి మనస్తత్వం కనిపిస్తుంది. ఫ్యాన్స్ కి పరవ్ స్టార్ ..జనలాకి జనసేనుడు. కానీ ఇంట్లో మాత్రం అన్నా వదినల దగ్గర చంటి పిల్లాడే. ముఖ్యంగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ దగ్గరకి వెళ్ళగానే కొడుకులా మారిపోతాడు పవన్ కళ్యాణ్. ఒదిన దగ్గర ఒదిగిపోయి పాదాల చెంత కూర్చిని తనలో అమ్మని చూసుకుంటాడు. ఇక మెగాస్టార్ కి పవర్ స్టార్ తమ్ముడికంటే ఒక కొడుగానే అనిపిస్తాడు. అన్నా వదిన దగ్గరికి వెళితే మాత్రం చిలిపి నవ్వుతో పవర్ స్టర్ అన్న విషయమే మర్చిపోతాడు. ఇది ఎవరికైనా సాధ్యమా..ఒక్క పవన్ కళ్యాణ్ కి తప్ప.   

మరింత సమాచారం తెలుసుకోండి: