నిత్యా మీనన్ గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. అందం, అభినయం రెండు ఒకదానికొకటి పోటీ పడి ఉంటాయి నిత్యాలో. తన నటనతో అవతల ఉన్న ఏ హీరో నైనా చాలా ఈజీగా డామినేట్ చేస్తుంది. కళ్ళతోనే హావాభావాలు పలికించడంలో నిత్యా చాలా గట్టిది. మాలయాళం చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన నిత్యా చాలా సెలెక్టివ్ గా సినిమాలను చేస్తూ కొనసాగుతోంది. తను సై అనాలేగాని మంచి మంచి సినిమాలు తన అకౌంట్ లో ఉంటాయి. కానీ నిత్యా లా ఒప్పుకోదు. నచ్చితేనే చేస్తుంది. లేదంటే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. అది ఎంత బ్యానర్ అయినా, ఎంత పెద్ద దర్శకుడైనా ..హీరో ఎవరైనా. ఈ విషయంలో నిత్యా మొండి ఘటమే. కాంప్రమైజ్ అయ్యో మనస్తత్వం కానే కాదు. అనవసరమైన ఏ ప్రాజెక్ట్ కి కమిటవదు.

 

నిత్యా ఒక సినిమా ఒకే చేయాలంటే ముందు కథ నచ్చాలి. అందులో తన పాత్ర నచ్చాలి. చాలా క్లీన్ గా అనిపించాలి క్యారెక్టర్. ఏమాత్రం చెప్పిన కథ చెప్పినట్టు తీయకపోయిన్న ఒకటి చెప్పి ఒకటి తీసిన నిత్యా నిర్మొహమాటంగా కడిగిపారేస్తుంది. లేదా ఆ సినిమా నుండి బయటకి వచ్చేస్తుంది. ఇక టాలీవుడ్ లో నిత కి బాగా క్లోజ్ అంటే నందిని రెడ్డి, నాని. ఆ తర్వాత నితిన్. వీళ్ళే నిత్యకి బాగా క్లోజ్. తెలుగు సినిమాలో నటిస్తూ ప్రభాస్ తెలీదన్న అమాయకురాలు. నిజంగా ఆ టైం కి ప్రభాస్ ఎవరో తెలీదట. ఇక ప్రముఖ నటుడు రఘువరణ్ సతీమణి రోహిని కి నిత్యా ఫేవరేట్. అలానే నిత్యాకి తనంటే విపరీతమైన అభిమానం.

 

ఇక నిత్యా కొన్ని విషయాలలో ఇప్పటికి కాంప్రమైజ్ కాలేదు. అందుకే చాలా తక్కువ సినిమాలు చేసింది. తనకున్న టాలెంట్ కి కాంప్రమైజ్ అయితే గనక ఈ పాటికి తన రేంజ్ మామూలుగా ఉండేది కాదు. పొట్టిగా ఉన్న యూత్ లో నిత్యా కి ఉన్న క్రేజ్ అసాధారణం. ఇక వాస్తవంగా నిత్యా గ్లామర్ గా కనిపించకపోవడం తనకి పెద్ద మైనస్. ఏమాత్రం హాట్ డ్రెస్ లో నటించదు. ఒళ్ళు చూపించే సీన్స్ ని ఒప్పుకోదు. కథకి అవసరమని ఎక్స్ఫోజింగ్ చేయడం పెదవి జుర్రుకునే ముద్దులివ్వడం నిత్యకి అసలు నచ్చదు. ఈ క్వాలీటిస్ వల్లే నిత్య స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయినప్పటికి క్యారెక్టర్ కోసం నా క్యారెక్టర్ చంపుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటుంది నిత్యా. 

 

అయితే చాలామంది మేకర్స్ సినిమాకి సైన్ చేశాక కొన్నిసార్లు ఎక్స్ఫోజింగ్ చేపించాలని ప్రయత్నించారట. సాంగ్స్ లోనైనా నడుము నాభి చూపించమని అడిగారట. లిప్ కిస్ ఉంటే బావుంటుంది యూత్ బాగా అట్రాక్ట్ అవుతారు అని కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారట. అయితే ఆ మేకర్స్ కి నిత్యా మీనన్ చెప్పిన సమాధానం వింటే దిమ్మ తిరిగిపోతుంది. ఎక్స్ఫోజింగ్ చేసి హీరోకి లిప్ కిస్ ఇస్తేనే సినిమా హిట్ అవుతుందనుకుంటే అన్ని అవే సినిమాలు రావాలి కదా మరి రావడం లేదేఅని మొహాన అడిగిందట. అంతేకాదు అలాంటి చీప్ క్యారెక్టర్స్ ట్రిక్స్ ప్లే చేస్తే నా దగ్గరికి రావద్దని వార్నింగ్ ఇచ్చిందట. అదీ నిత్యా కాంఫిడెన్స్ అంటే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: