క్రియేటివిటీ ఐడియాస్ వచ్చినంత కాలం దర్శకుల నుంచి మంచి సినిమాలు.. కాన్సెప్టులు, స్క్రీన్ ప్లే, మంచి టేకింగ్ తో హిట్లు వస్తాయి. అనుభవం వచ్చింది కదా అని ఏది పడితే అది ఎలా పడితే అలా తీసి ప్రేక్షకుల మీదకు వదిలేస్తే వాళ్లే రివర్స్ స్వీప్ కొట్టడం ఖాయం. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ ఆలీ పరిస్థితి అలానే ఉంది. అసలే.. సినిమా బాగుంటేనే జనాలు ధియేటర్లకు రాని కాలంలో ప్రతి సినిమా జాగ్రత్తగా తీయాల్సిన పరిస్థితి. ఇక్కడ మంచి ప్రతిభ ఉన్న ఇంతియాజ్ ఆలీ ఘోరంగా దెబ్బ తిన్నాడు.

 

 

లవర్స్ డే సందర్భంగా ఆయన తీసిని లవ్ ఆజ్ కల్2 సినిమా విడుదలైంది. మొదటి షో నుంచే ఘోరమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. శృంగార సన్నివేశాల్లో ఓవర్ డోస్, పట్టు లేని స్క్రీన్ ప్లే, బూతు కంటెంట్ తో సినిమా తేలిపోయింది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఘోరమైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి. జబ్ వి మెట్, లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, కాక్ టైల్, హైవే.. లాంటి హిట్స్ తీసిన దర్శకుడేనా అంటూ విమర్శలు సంధిస్తున్నారు. 2009లో వచ్చిన లవ్ ఆజ్ కల్ సినిమా సూపర్ హిట్. ఆ సినిమానే తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్త్రిష జంటగా తీన్ మార్ సినిమా తీశారు.

 

 

లవ్ ఆజ్ కల్2 లో హీరోయిన్ సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా ఆలీఖాన్. సినిమాలో రణదీప్ హుడా-ఆరుషిల పార్ట్, హీరో కార్తీక్ ప్రెసెన్స్ తప్ప ఏమీ లేదంటున్నారు. సారా యాక్టింగ్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. పోటీ లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దెబ్బతిని ఇంతియాజ్ ఆలీ పేరు పోగొట్టింది. క్రిటిక్స్ కూడా పూర్ అని తేల్చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: