టాలీవుడ్ సంచలన దర్శకుడుగా పేరుగాంచిన
రామ్ గోపాల్ వర్మ మొదట కొన్నేళ్ల క్రితం
సినిమా పరిశ్రమకు అసిస్టెంట్
డైరెక్టర్ గా రంగప్రవేశం చేయడం జరిగింది. ఇక అక్కడినుండి మెల్లగా
సినిమా డైరెక్షన్ లోని మెళకువలను పలువురు దర్శకుల వద్ద నేర్చుకున్న
వర్మ, తొలిసారిగా
అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన
శివ సినిమా ద్వారా దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే అత్యద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అలానే ఆ
సినిమా ద్వారా ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డుతో పాటు ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు వర్మ. ఇక అక్కడి నుండి వరుసగా పలువురు
టాలీవుడ్ నటులతో పాటు అటు
బాలీవుడ్ లోనూ అగ్ర నటులతో సినిమాలు తీసిన
వర్మ, చాలావరకు మంచి విజయాలు అందుకుని దర్శకుడిగా మంచి పేరుతో దూసుకు దూసుకుపోయారు.
ఇక ఆ తర్వాత నుండి
వర్మ హవా మెల్లగా తగ్గుతూ వచ్చింది. ఇక ఇటీవల కాలంలో అయితే ఆయన తీస్తున్న సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయాలుగా నిలుస్తున్నాయి. ఇక ఏ విషయాన్ని అయినా తన మనసుకు అనిపించిన విధంగా మొహమాటం లేకుండా మాట్లాడే
వర్మ, ఇటీవల ఒక
మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. అయితే ఆ విషయం విన్న యాంకర్ కు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. ఇంతకీ విషయం ఏంటంటే, పొద్దున్నే లేవగానే మీ దినచర్య ఎలా స్టార్ట్ అవుతుంది, అలానే మీరు
యోగా, వ్యాయామం వంటివి చేస్తారా అంటూ సదరు యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన
వర్మ మాట్లాడుతూ, నిజానికి అందరిలాగా తనకు పొద్దున్నే వ్యాయామం వంటివి చేసే అలవాటు లేదని, తనకు డైలీ నిద్రలేవగానే కాసేపు పోర్న్ వీడియోలు, అలానే ఇంకొంత సమయం ఖాళీ ఉంటే డాక్యుమెంటరీలు చూస్తానని అన్నారు.
అలా పొద్దున్నే పోర్న్ వీడియోలు చూడటం వలన మనిషిలో ఎన్డాల్ఫిన్ అనే హార్మోన్ బాగా రిలీజ్ అయి, దానివల్ల మన రోజు మొత్తం కూడా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహముగా సాగుతుందని
వర్మ చెప్పటం జరిగింది. అయితే
వర్మ మాట్లాడిన ఆ మాటలను ఇప్పటికీ మన ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. ఎవరైనా
పొద్దున్నే లేవగానే వ్యాయామమో, లేక యోగాను చేస్తారు. అంతేగాని ఇలా పోర్న్ వంటి పాడు వీడియోలు చూసే మీరు, వింత మనిషి
వర్మ గారు అంటూ తమ సోషల్
మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు....!!