టాలీవుడ్ లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చిన్నతనంలోనే టాలీవుడ్ కి తెరంగేట్రం చేసిన మహేష్ బాబు, ఆ వయసులోనే పలు చిత్రాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్నాడు. ఇక పెరిగి పెద్దయ్యాక రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకుని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించారు. ఇక ఆ తరువాత నుండి మెల్లగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఆపై ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి, హీరోగా అత్యున్నత శిఖరాలు అధిరోహించి, తండ్రి కృష్ణ వలే సూపర్ స్టార్ అనే బిరుదును సంపాదించారు. 

 

ఇక ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా వెలుగొందుతున్న మహేష్, నిజానికి చిన్నప్పుడే ఎంతో చలాకీగా ఉండేవాడని, ఇక ఆ సమయంలోనే తాను చేస్తున్న సినిమాల్లో ఫైట్స్, డ్యాన్స్ లు అదరగొట్టిన మహేష్, ఫైట్స్ విషయమై కొంత సాహసోపేతమైన సీన్స్ లో కూడా ఏ మాత్రం డూప్ లేకుండా నటించేవడని కృష్ణ పలుమార్లు చెప్పారు. ఇక ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కృష్ణ మాట్లాడుతూ, మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా డ్యూయల్ రోల్ చేసిన కొడుకు దిద్దిన కాపురం సినిమా షూటింగ్ లో భాగంగా ఒక సీన్ లో బైక్ తో డైవ్ చేయవలసిన రిస్కీ సీన్ ఒకటి ఉందని, అయితే ఆ సీన్ కోసం మహేష్ కు డూప్ ని రెడీ చేయడం జరిగిందని అన్నారు. 

 

ఆ విషయం తెలుసుకున్న మహేష్, ఎటువంటి డూప్ అవసరం లేకుండా తానే స్వయంగా చేయాలనుకున్నాడని, కానీ ఆ విషయం నాకు చెపితే నేను ఒప్పుకోనని భయమేసి, నేను మధ్యలో భోజనానికి వెళ్లిన సమయంలో స్టంట్ మాస్టర్ సాయంతో రియల్ గా ఆ రిస్కీ బైక్ సీన్ లో తానే యాక్ట్ చేసాడని అన్నారు. అయితే భోజనం ముగించుకుని వచ్చిన తరువాత ఆ విషయం నాకు తెలియడంతో మహేష్ ని ఈ విషయమై ప్రశ్నిస్తే, నా బదులు డూప్ ఎందుకు నాన్న, ఆ మాత్రం రిస్క్ చేయగలను అంటూ డేరింగ్ గా సమాధానం చెప్పాడని అన్నారు. ఇక ఈ విధంగా చూసుకుంటే మహేష్ బాబు, ఇప్పుడేంటి, అప్పటి చిన్నవయసులోనే సూపర్ స్టార్ అని అనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు కదు.....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: