టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సినిమా అలవైకుంఠపురములో. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ నిర్మించడం జరిగింది. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని కలెక్షన్ కూడా బాగా రాబట్టింది. 

 

తన మార్క్ పంచ్ డైలాగ్స్ తో, అలానే మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ తో పాటు ఆకట్టుకునే యాక్షన్ సీన్స్ ని కలగలిపి దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని తీయడం జరిగింది. ఇక ఈ సినిమా లోని సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి ఎంతటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని రాములో రాముల, సామజవరగమనా సాంగ్స్ అయితే మరింత సూపర్బ్ గా హిట్ అయ్యాయి. ఇక ఇటీవల సామజవరగమనా సాంగ్ యూట్యూబ్ లో 200 మిలియన్ల వ్యూస్ ని అందుకుని అత్యద్భుత రికార్డు ని దక్కించుకుంది. 

 

ఇక థియేటర్ లో కూడా విజువల్ గా ఎంతో అదరగొట్టిన ఈ సాంగ్ ఫుల్ వీడియోని రేపు సాయంత్రం సరిగ్గా 4 గంటల 5 నిమిషాలకు యూట్యూబ్ రిలీజ్ చేయనున్నట్లు సినిమా నిర్మాతలు నేడు ఒక పోస్ట్ చేయడం జరిగింది. దీనితో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుంగా పోయాయి. నిజంగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఎంతో అలరించిన ఈ సాంగ్ రేపు యూట్యూబ్ లో రిలీజ్ అయ్యాక, వారికి మరింత ఐ ఫీస్ట్ ని అందిస్తుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అయితే లిరికల్ సాంగ్ మాదిరిగానే ఈ వీడియో సాంగ్ కూడా అదరగొట్టే వ్యూస్ తో దూసుకుపోవడం ఖాయం అని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: