తమిళంలో పదేళ్ల క్రితమే కెరియర్ స్టార్ట్ చేసిన ఐశ్వర్యా రాజేష్ తెలుగులో మాత్రం రెండు సినిమాలే చేసింది. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు మొదట సైన్ చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత తమిళంలో తను నటించిన కణ సినిమా తెలుగు రీమేక్ కౌసల్యా కృష్ణమూర్తి సినిమాలో నటించింది. అయితే కౌసల్యా కృష్ణమూర్తి సినిమా ముందు రిలీజ్ అయ్యింది. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

 

సినిమాలో మేల్ లీడ్ విజయ్ దేవరకొండతో పాటుగా హీరోయిన్స్ గా నటించిన రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ ఇద్దరు తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలో సువర్ణ పాత్రలో ఐశ్వర్యా రాజేష్ నటన అందరిని మెప్పించింది. ఆమె అభినయం.. సహజత్వం చూస్తుంటే తెలుగులో సరైన అవకాశం రావాలే కాని ఐశ్వర్యా కచ్చితంగా పాపులర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని చెప్పొచ్చు. 1980-90 మధ్య కాలంలో తెలుగు, తమిళ భాషల్లో నటించిన నటుడు రాజేష్ కూతురే ఐశ్వర్యా రాజేష్.

 

క్యారక్టర్ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మికి మేన కోడలు ఈ అమ్మడు. మరి ఫ్యామిలీలోనే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఆమె అంత బాగా నటిస్తుంది. తెలుగులో చేసిన రెండు సినిమాలు వర్క్ అవుట్ అవలేదు కాబట్టి ఐశ్వర్యా రాజేష్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవచ్చు. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న టక్ జగదీష్ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ నటిస్తుందని తెలుస్తుంది. మరి నాని సినిమాతో అయినా అమ్మడు హిట్ కొడుతుందేమో చూడాలి. ఐశ్వర్యా రాజేష్ తో పాటుగా సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: