టివి ఆన్ చేస్తే చాలు జబర్దస్త్, ఢీ షోలలో సుడిగాలి సుధీర్, రష్మిక చేసే హంగామా అంతా ఇంతా కాదు. వాళ్లిద్దరి మధ్య ఏం లేదని బయట చెబుతున్నా షో సక్సెస్ ఫుల్ గా నడవడం కోసం ఇద్దరి మధ్య లవ్ స్టోరీ నడిపిస్తున్నారు షో నిర్వాహకులు. సుధీర్ రష్మి వెంటపడటం ఆమె చీ.. పో.. అని చీదరించుకోవడం ఇదంతా స్క్రిప్ట్ లో భాగమని తెలుస్తుంది. వాళ్లమధ్య కెమిస్ట్రీ బాగుందని అలానే కొనసాగిస్తున్నారు. అయితే ఏదైనా సాగేంతవరకే సాగదీయాలి లేదంటే తెగిపోద్ది.. అదేవిధంగా ఆడియెన్స్ చూస్తున్నారు కదా అని సుధీర్, రష్మిల మధ్య ఈ లవ్ స్టోరీని మరింత పొడిగిస్తే కష్టమే అంటున్నారు.

 

వాలెంటైన్స్ డే నాడు షోలో భాగంగా ఓ సాంగ్ పెట్టి అందులో సుధీర్ రష్మికి ప్రపోజ్ చేస్తాడు. లవ్ సింబల్ బెలూన్ ఇచ్చి నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని భారీ డైలాగ్ కొట్టాడు సుధీర్. అయితే ఇదివరకులా ఆడియెన్స్ ఇదంతా నిజమే అని నమ్మే సీన్ పోయింది. జస్ట్ షో కోసమే వారిద్దరు అలా లవర్స్ లా నటిస్తున్నారని వారికి అర్ధమైంది. అందుకే ఈమధ్య ఢీ షో రేటింగ్ తగ్గిందని తెలుస్తుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటే కామెడీ కాబట్టి నడిపించేస్తున్నారు.

 

సుధీర్, రష్మిల మధ్య ఏమి లేకున్నా ఏదో ఉన్నట్టు చూపించి ప్రేక్షకులను మిస్ గైడ్ చేస్తున్నారు. ఈ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడాలంటే ఇద్దరిలో ఎవరికో ఒకరికి పెళ్లి కావాలి. రష్మికి పెళ్లి మీద ఇప్పుడప్పుడే ఇంట్రెస్ట్ లేదని అనిపిస్తుంది. మరి సుధీర్ అయినా పెళ్లి చేసుకుని రష్మి నుండి దూరంగా వేళ్తే బెటర్ అని అనుకుంటున్నారు. ఈమధ్యనే సుధీర్, రాష్మిలకు పోటీగా హైపర్ ఆది, వర్షిణిల జోడీ ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: