అతను పెద్దగా తెలియదు కానీ అతని పేరు మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆ పేరు తెలిసిన అతనే అని ఎవరు అనుకోరు లెండి.. కానీ ఆ పేరు మనకు సుపరిచితమే.. ఆ పేరు ఏంటంటే ఉదయ్ కిరణ్. కానీ మనం మాట్లాడేది ఆ ఉదయ్ కిరణ్ గురించి కాదు.. మరో యాంగ్ హీరో ఉదయ్ కిరణ్ గురించి. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యువ నటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ హఠాన్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆసపత్రికి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుండగా అతడు మరణించాడు. ఉదయ్‌కిరణ్‌ పార్థివ దేహానికి పలువురు రాజకీయ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. 

 

ఉదయ్ కిరణ్ ఏ సినిమాల్లో నటించాడు అంటే.. పరారే, ఫ్రెండ్స్‌ బుక్ అనే సినిమాల్లో హీరోగా ఉదయ్‌కిరణ్‌ నటించారు. అంతేకాదు పలు తమిళ సినిమాల్లోనూ ఈ హీరోకి అవకాశాలు వచ్చాయి. అయితే అన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ అతను ఎన్నో సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నాడు. 

 

2016లో జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్ లో గొడవ చెయ్యడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఉదయ్ కిరణ్ ని అరెస్ట్ చేశారు.. విలాసంగా బతకడం అలవాటు అయినా ఈ యాంగ్ అప్పట్లో కొన్ని నేరాలకు కూడా పడ్డాడు. కొన్ని సార్లు అరెస్ట్ అయ్యి జైలు జీవితం కూడా గడిపాడు.. ఎంతోమంది మహిళలను సినిమా అవకాశాలు ఇప్పిస్తా అని మోసం కూడా చేశాడు. ఉదయ్ కిరణ్ పై క్రిమినల్ కేసులు కూడా నమోదు అయ్యాయి.  

 

ఇంకా ఇంటి యజమానిపై దౌర్జన్యం చెయ్యడంతో అతనిపై క్రిమినల్ కేసు పెట్టారు. ఇలా ఎంతోమంది ఆడవారిని మోసం చేసి.. దౌర్జన్యాలకు దిగి.. మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఉదయ్ కిరణ్ కు ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో చికిత్స అందించారు.. చివరికి ఇప్పుడు గుండె పోటుతో మరణించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: