యంగ్ హీరో నితిన్‌ త్వరలో పెళ్లి పీఠలెక్కనున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లుగా ప్రేమిస్తున్న షాలినిని త్వరలో పెళ్లాడబోతున్నాడు నితిన్. శనివారం పెళ్లి పనులు ప్రారంభించారు. ఏప్రిల్‌ 15, 16 తేదిల్లో దుబాయ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ తరహాలో పెళ్లి వేడుక జరగనుంది. నిన్న పెళ్లి పనులు ప్రారంభిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను నితిన్‌ తన సోషల్‌ మీడియా ద్వారా అభిమానుల కోసం షేర్‌ చేసుకున్నాడు. అయితే ఈ ట్వీట్‌ పై యంగ్ హీరోలు నాని, నవదీప్‌ లు ఆసక్తికరంగా స్పందించారు.

 

నితిన్‌ పోస్ట్‌ కు రిప్లై ఇస్తూ క్రికెట్‌ లో ఎంపైర్‌ అవుట్ అంటూ సిగ్నల్‌ ఇవ్వబోతున్నట్టుగా ఉన్న జిఫ్‌ ఇమేజ్‌ ను పోస్ట్ చేశాడు నాని. ఈ ఇమేజ్‌తో పాటు పెళ్లైన హీరోల లిస్ట్‌ లోకి ఆహ్వానం పలుకుతూ `దా` అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్‌పై స్పందించిన నవదీప్‌ `ఈ పెళ్లైనోల్లు ఉన్నారే` అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ కాన్వర్జేషన్‌పై ఆర్‌ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ కూడా స్పందించాడు. ఇక ప్రస్తుతం నితిన్ హీరోగా భీష్మా సినిమాను తెరకెక్కిస్తున్న వెంకీ కుడుముల `ఎపిక్‌ కామెంట్` అంటూ నానికి మద్ధతు తెలిపాడు.

 

ఇక సినిమాల విషయానికి వస్తే నితిన్‌ ప్రస్తుతం భీష్మా సినిమాలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నాని తొలిసారిగా పూర్తి స్థాయి నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నాడు. సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అదితిరావ్‌ హైదరీ, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: