రాజమౌళి తరువాత ఇప్పటి వరకు పరాజయం అన్నపదం ఎరుగని దర్శకుడు కొరటాల శివ. ఈయన దర్శకత్వంలో నటించాలని ఎందరో హీరోలు ప్రయత్నాలు చేస్తున్నా కొరటాల మాత్రం చిరంజీవి పై మోజుతో గత రెండు సంవత్సరాలుగా మెగా కాంపౌండ్ లో చిక్కుకున్నాడు. ఎట్టకేలకు కొరటాల చిరంజీవితో తీస్తున్న సినిమా షూటింగ్ ను వేగవంతం చేసినా ఆమూవీ ఎప్పుడు విడుదల అవుతుంది అన్నవిషయం రాజమౌళి దయ పై ఆధారపడి ఉంది. 


ఈమూవీలో సుమారు 30 నిముషాలు ఉండే ప్రత్యేక పాత్రలో రామ్ చరణ్ ను పెడితే బాగుంటుంది అనీ చిరంజీవికి రాని ఆలోచనను కొరటాల చిరంజీవికి కలిగించాడు అని అంటారు. అయితే ఇప్పుడు చరణ్ పాత్రకు సంబంధించి స్క్రిప్ట్ అంతా రెడీ అయిన తరువాత చరణ్ తో ఆపాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసినా ఈమూవీ విడుదల మాత్రం వచ్చే ఏడాది ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తరువాత మాత్రమే అన్న రాజమౌళి కండిషన్ కు షాక్ అయిన కొరటాల ఇలాంటి పరిస్థితులలో చిరంజీవికి మరొక సలహా ఇచ్చాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

 

ఈఏడాది ఈమూవీని విడుదల చేయడానికి చరణ్ పాత్ర అడ్డుగా మారడంతో చరణ్ కు బదులు ఆపాత్రను మెగా కాంపౌండ్ లోని వరుణ్ తేజ్ చేత కాని లేదంటే సాయి తేజ్ తో గాని చేయించి ఇదే సంవత్సరం ఈమూవీ విడుదల చేస్తే బాగుంటుంది అన్న సూచన కొరటాల చిరంజీవికి ఇచ్చినట్లు టాక్. 


అయితే ఈ సూచన చిరంజీవికి నచ్చక ఎంత కాలం అయినా వేచి ఉండి ఈ మూవీలో చరణ్ చేత నటింప చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేద్దాము అన్న విషయాన్ని చిరంజీవి చల్లగా కొరటాల కు చెప్పడంతో మరొక మాట్లాడలేక అనవసరంగా తాను అత్యుత్సాహంతో ఈ మూవీలో చరణ్ కు ఒక ప్రత్యేక పాత్రను క్రియేట్ చేసి తనకు తాను సమస్యలలోకి నెట్టివేయబడ్డానా అంటూ కొరటాల బాధ పడుతున్నట్లు టాక్. అయితే ఇంత బాధ ఉన్నా ఈవిషయాన్ని బయటకు చెప్పలేక చిరంజీవి సినిమా కోసం తన విలువైన మూడు సంవత్సరాల కాలాన్ని వృథా చేసుకుంటున్న కొరటాల పరిస్థితి చూసి కొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: