సోషల్‌ మీడియా కారణంగా ఎన్ని లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీ ప్రైవసీ విషయంలో సోషల్ మీడియా కారణంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది నెటిజెన్లు అత్యుత్సాహంతో చేసే కొన్ని కామెంట్లు హీరోయిన్లకు కోపం తెప్పిస్తోంది. చాలా సందర్భాల్లో వాళ్లు మౌనంగానే ఉన్నా తప్పని సరిపరిస్థితుల్లో కొన్నిసార్లు రిప్లై కూడా గట్టిగానే ఇస్తున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్‌ చాందినీ చౌదరికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.


ఓ పేరున్న ట్విట్టర్‌ ఎకౌంట్‌లో చాందినికి సంబంధించిన ఓ వార్తను ట్వీట్ చేశారు. కొంత మంది హీరోయిన్లకు సంబంధించిన వార్తలో చాందిని గురించి ప్రస్తావిస్తూ బీ గ్రేడ్‌ హీరోయిన్‌ అంటూ ట్వీట్ చేసింది సదరు సంస్థ. అయితే ఈ ట్వీట్‌ చాందిని వరకు వెళ్లటం ఆమె సీరియస్‌ అయ్యింది. ట్వీట్ చేసిన సంస్థకు గట్టిగానే గడ్డి పెట్టింది చాందిని. `మీడియా, జర్నలిజం ఇంతగా దిగజారిపోయిందన్నమాట. B గ్రేడ్ అంటే ఎంత పెద్ద బూతు మాటో మీకు తెలుసా? అసలు దాని అర్థం తెలుసా? మిమ్మల్ని చూసి మీరే సిగ్గుపడాలి. ఇది పరమ దరిద్రంగా ఉంది. మీలాంటి వాళ్ల వల్లే టాలెంట్ ఉన్న అమ్మాయిలు సినీ ఇండస్ట్రీకి రావాలంటే భయపడుతున్నారు. ఇది సిగ్గుచేటు` అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది చాందిని.


`కొంత మంది మనం చేసే పనులపై నీరు చల్లాలని, మనల్ని తొక్కేయాలని చూస్తుంటారు. అలాంటి నెగిటివ్ ప్రజలు మానవత్వానికే మచ్చ తెచ్చే రకం. ఒకవేళ శాస్త్రవేత్త అయిన ఎడిసన్‌ని కూడా ఇలాగే వెక్కిరించి, ఎగతాళి చేసి ఉంటే ఏమై ఉండేదో ఆలోచించండి` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చాందినిని మాత్రమే కాదు హెబ్బా పటేల్, బిందు మాధవిలను కూడా బీ గ్రేడ్‌ హీరోయిన్లుగా పేన్కొంది చేర్చింది ఆ సంస్థ. వాస్తవానికి అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించేవారిని బీ గ్రేడ్‌ హీరోయిన్లు అంటారు. కానీ సదరు సంస్థ చిన్న సినిమాల్లో నటించే హీరోయిన్లను బీ గ్రేడ్‌ హీరోయిన్లు అంటూ సంబోదించి పప్పులో కాలేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: