నితిన్ షాలిని ల పెళ్ళి పనుల ప్రారంభానికి సంబంధించిన వేడుకలో నితిన్ ఊహించని షాక్ తనకు కాబోయే భార్య షాలిని కి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫంక్షన్ కోసం మధ్యాహ్నం వరకు తన ఇంటిలో ఉన్న నితిన్ ఈ ఫంక్షన్ పూర్తి అయిన వెంటనే మేకప్ వేసుకుని మధ్యాహ్నం హడావిడిగా ‘భీష్మ’ మూవీకి సంబంధించి చిన్న ప్యాచ్ వర్క్ సీన్ చేయడానికి వెళ్ళినట్లు తెలుస్తోంది. 


దీనితో ఈ ఫ్యామిలీ ఫంక్షన్ కు వచ్చిన నితిన్ సన్నిహితులు అంతా నితిన్ ప్రోఫిషనల్ అవుట్ లుక్ కు ఆశ్చర్య పోయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే నితిన్ కాబోయే భార్య షాలిని ఆంధ్రా ప్రాంత అమ్మాయి అన్న విషయం కూడ వెలుగులోకి వచ్చింది. దీనితో తెలంగాణ అబ్బాయి ఆంధ్రా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. 


అమెరికాలో ఎమ్.బి.ఎ. చేసిన షాలిని పెళ్ళి తరువాత బిజినెస్ ఉమెన్ గా మారే అవకాశం ఉంది. ఏప్రిల్ 16న దుబాయ లోని పలాజో వర్సాచీ హోటల్ లో నితిన్ షాలిని పెళ్ళి జరగబోతోంది. నిన్న జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో నితిన్ భార్య షాలిని కుందనపు బొమ్మలా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'పెళ్లి పనులు మొదలయ్యాయి మ్యూజిక్ స్టార్ట్స్ మీ ఆశీస్సులు కావాలి' అంటూ నితిన్ ట్వీట్ ఇప్పుడు అతడి అభిమానుల మధ్య వైరల్ గా మారింది. 


ప్రస్థుతం టాప్ యంగ్ హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగి పోవడంతో వారి సినిమాల కలక్షన్స్ ఫిగర్స్ మధ్య కూడ పోటీ పెరిగిపోతోంది. నితిన్ నటించిన ‘అ ఆ’ సినిమాకు అప్పట్లో 40 కోట్లకు పైగా కలక్షన్స్ వచ్చినా ఆ క్రెడిట్ అంతా త్రివిక్రమ్ సమంతల ఖాతాలోకి వెళ్ళి పోయింది. దీనితో ఈ వారం విడుదల కాబోతున్న ‘భీష్మ’ నితిన్ కెరియర్ కు సంబంధించి తొలి 50 కోట్ల సినిమాగా మారుతుందా లేదా అన్నది ‘భీష్మ’ తో తెలిసిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: