టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరో గా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. మొదటి నుంచి ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది.ఇప్పటి  వరకు కనిపించినట్లుగా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నాలుగు షేడ్స్  కనిపిస్తుండటం అంతేకాకుండా ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేస్తుండడంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైన ఇప్పటికీ ప్రేక్షకులను నిరాశ పరిచిందని టాక్ కూడా  వచ్చిన విషయం తెలిసిందే. 

 

 

 మొదటి నుంచి ఈ సినిమా భిన్నమైన టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టాక్  పరంగానే కాదు కలెక్షన్ల పరంగా కూడా నిరాశ పరుస్తున్నట్లు  తెలుస్తోంది. సెన్సేషనల్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ స్థాయికి తగ్గట్లుగా కలెక్షన్స్  రావడం లేదు ఈ సినిమాకి. ఈ సినిమా టాక్  సినిమా కలెక్షన్ల పై భారీగా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ మిగతా సినిమాలతో పోలిస్తే ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. సరిగ్గా రెండేళ్ల కిందట విడుదలైన గీత గోవిందం సినిమాతో  తొలి రోజే 10 కోట్ల షేర్ వసూలు చేసాడు విజయ్ దేవరకొండ. 

 

 

 ఇక ఆ తర్వాత విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మొదటిరోజే 12 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక విజయ్ కెరీర్లో డిజాస్టర్ గా  నిలిచిన నోటా కూడా తొలి రోజు ఎనిమిది కోట్ల షేర్ వసూలు చేసింది. కానీ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్  మాత్రం తొలి రోజు కేవలం ఐదు కోట్ల తో సరిపెట్టుకుంది. మొదటిరోజు 5.53 కోట్ల షేర్ వసూలు చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రెండవ రోజు 2.4 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ 8 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ఈ సినిమాకు బిజినెస్ 20 కోట్లకు పైగానే జరిగింది మరి ఈ సినిమా వసూళ్లు నత్తనడకన నడుస్తున్న నేపథ్యంలో.. 20 కోట్లు షేర్స్ దాటి పోయేలా విజయ్ దేవరకొండ ఈ సినిమాను తీసుకెళ్లగలుగుతాడ అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: