కార్తీకదీపం సీరియల్ దెబ్బకు బుల్లితెరపై రికార్డులన్నీ బద్దలవుతున్న సంగ‌తి తెలిసిందే. రాత్రి 7.30 అయ్యిందంటే టీవీలకు అతుక్కుపోయాలే చేస్తున్న సీరియల్ ‘కార్తీకదీపం’. సీరియల్స్ అంటే అసహ్యించుకునేవాళ్లు సైతం దీపక్క ఎమోషన్స్‌కి ఫిదా అవుతారంటే అతిశయోక్తి కాదు. ఇంటిలోని అమ్మ, అక్క, చెల్లి, నాన్నమ్మ, అత్త, అమ్మమ్మ ఇలా మహిళాలోకం ‘కార్తీకదీపం’ సీరియల్‌కి నీరాజనాలు పలుకుతుండటంతో ఈ సీరియల్ కనీవనీ ఎరుగని రీతిలో టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది.

 

వాస్త‌వానికి ప్రేమి విశ్వనాధ్ మలయాళం లో కరుతముతూ అనే సీరియల్ తో బుల్లి తెరకు పరిచయమైంది. ఆ సీరియల్ లో ఒక నల్ల అమ్మాయిగా కనిపించింది ప్రేమి విశ్వనాధ్ . కరుతముతూ సీరియల్ ద్వారా తన నటనతో అందరిని మేపించింది. ఆ సీరియల్ అక్కడ సూపర్ హిట్ కావడంతో ఆ సీరియల్ ని మన తెలుగులో కార్తీక దీపం పేరుతో చిత్రీకరిస్తున్నారు. అలాగే కార్తీకదీపం సీరియల్ లో దీప క్యారెక్టర్ కి ప్రేమి విశ్వనాధ్ తప్ప వేరేవారు సరిపోరు అని అనుకున్న డైరెక్టర్ ఈ సీరియల్ లో కూడా ఆమెనే ఫిక్స్ చేసారు. అయితే ఈమె న‌ట‌న‌తో.. స్టార్ హీరోయిన్స్‌కి సైతం లేని క్రేజ్ ఈ దీపక్క సంపాదించుకుంది.

 

ఇక విడిపోయిన కొడుకు, కోడలిని కలపాలని ప్రయత్నించే అత్త కథే కార్తీకదీపం. ప్రతి ఎపిసోడ్ సస్పెన్స్ తో, తెరకెక్కిస్తూ బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోంది కార్తీకదీపం సీరియల్ టీమ్. అయితే కార్తీక దీపం దెబ్బకు పెద్ద పెద్ద సీరియల్స్ అన్నీ రేటింగుల్లో చాలా వెనకబడిపోతున్నాయి. ఇక ఈ వారం రేటింగ్స్ లో సైతం కార్తీక దీపం మొదటి స్థానంలో నిలిచింది. కార్తీకదీపం సీరియల్‌కు దాదాపు 14 పాయింట్లకు పైగా రేటింగ్ వచ్చిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఎప్ప‌టిలాగానే ఈ సారి కూడా వంట‌ల‌క్క కార్తీక‌దీపం సీరియ‌ల్ మొద‌టి స్థానంలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: