రాజమౌళికి అందరి హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో రాజమౌళి తమతో సినిమా చేస్తే బాగుండును అన్న ఆలోచన అందరి టాప్ హీరోలలోను ఉంటుంది. ముఖ్యంగా మహేష్ అల్లు అర్జున్ లు రాజమౌళి పిలిస్తే చాలు అన్నట్లుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. 


వాస్తవానికి మహేష్ తో రాజమౌళి సినిమా ఉంటుంది అంటూ అన్న క్లారిటీ రాజమౌళి స్వయంగా ఇస్తున్నా అది ఎప్పుడు అన్నది మాత్రం చెప్పలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో మహేష్ అల్లు అర్జున్ లు ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియాను లెక్క చేయకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలి అన్న ఉద్దేశ్యంతో డిజైన్ చేస్తున్న వారి మూవీ యాక్షన్ ప్లాన్స్ రాజమౌళి దృష్టి వరకు రావడంతో ఈ విషయాలలోని అసలు నిజం ఎంతా అన్న విషయమై సమాధానాలు రాబట్టడానికి జక్కన్న తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. 


అల్లు అర్జు  సుకుమార్ ల కాంబినేషన్ మూవీ ఎట్టి పరిస్థితులలోను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే విధంగా యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసారు. అదేవిధంగా మహేష్ వంశీ పైడిపల్లి మూవీ కూడ ఈ ఏడాది మే నుండి మొదలు పెట్టి వేగంగా ఫినిష్ చేసి మళ్ళీ సంక్రాంతి రేస్ కు రావాలని ఆలోచనలు చేస్తున్నట్లుగా లీకులు అందుతున్నాయి. 


దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియాను లెక్క చేయకుండా నిజంగానే బన్నీ మహేష్ లు సాహసం చేస్తారా లేదంటే రాజమౌళి చేత రాయబారాలు చేయించుకోవడానికి ఇలాంటి లీకులను ప్రచారంలోకి తీసుకు వస్తున్నారా అన్న కామెంట్స్ వస్తున్నాయి. గతంలో ‘బాహుబలి’ వన్ విడుదల సమయంలో ఆ మూవీకి కేవలం వారం రోజుల గ్యాప్ తో ‘శ్రీమంతుడు’ మూవీ రిలీజ్ అవుతుంది అన్న లీకులు వచ్చి రాజమౌళి స్వయంగా మహేష్ ను కోరడంతో ‘శ్రీమంతుడు’ మూవీని ‘బాహుబలికి’ అడ్డం లేకుండా నెల రోజులు వాయిదా వేసారు. ఇప్పుడు మళ్ళీ రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం స్వయంగా రంగంలోకి దిగి మహేష్ బన్నీల సహాయం కోరవలసిన పరిస్థితులు ఏర్పడతాయా అంటూ రాజమౌళి ఎలా స్పందిస్తాడు అంటూ ఇప్పటి నుంచే ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: