తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు పల్లెటూరి తరహా చిత్రాల్లో ఎక్కువగా నటించారు.  ఆ తర్వాత ఆయన ఫ్యాక్షన్ తరహా చిత్రాల్లో ఎక్కువగా నటిస్తూ వచ్చారు.  ఒకరకంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ బాలయ్య అనే పేరు వచ్చింది.  ఈ తరహా చిత్రమే  'పల్నాటి బ్రహ్మనాయుడు'.  ఈ చిత్రం అప్పట్లో పెద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  అయితే ఈ చిత్రంలో కొన్ని సీన్లు చూస్తుంటే ప్రేక్షకులు పరమ బోర్ గా ఫీలయ్యారని టాక్ వచ్చింది.  కథాకథనాల సంగతి అటుంచితే, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు విడ్డూరంగా అనిపించడంతో ప్రేక్షకులు నవ్వుకున్నారు.

 

ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది బి. గోపాల్.  దర్శకుడు బి.గోపాల్ అనగానే లవ్,యాక్షన్ఎ, మోషన్ తో ఆయన తెరకెక్కించిన చిత్రాలు గుర్తొస్తాయి.  అప్పట్లో ఆయన తిసిన చిత్రాలకు ఎంతో క్రేజ్ ఉండేది.. కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి.  ఇక బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ లో పల్నాటి బ్రహ్మనాయుడు మూవీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.   తాజాగా బి గోపాల్ మాట్లాడుతూ.. అప్పట్లో బాలకృష్ణ నటించే ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు ఎంతో డిమాండ్ ఉండేదని.. ఆ నేపథ్యంలోనే పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రం తెరకెక్కించామని అయితే అనుకున్న విధంగా కథనం బాగానే ఉన్నా ఇందులో కొన్ని సన్నివేశాలు కాస్త ఓవర్ గా తీశారని విమర్శలు వచ్చాయి. 

 

బాలయ్య తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోయే సీన్ ను చేయాల్సింది కాదు. ఆ సీన్ వలన చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సీన్ పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. అలాంటి సన్నివేశాలు ఎంత హీరోయిజం ఉన్నా జరిగేవి కావని తర్వాత చాలా మంది విమర్శలు చేశారు.  అందుకు ఇప్పటికీ బాధపడుతూనే వున్నాను అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సీన్లు ఇప్పటికీ యూట్యూబ్ లో ఫన్నీ బిట్స్ కింద వస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: