బుల్లితెర ప్రేక్ష‌కులకు ఎంటర్ టైన్మెంట్ కొదవ ఉండదు. ఎందుకంటే.. వీళ్ల‌ను ఏడిపించాల‌న్నా.. క‌డుపుబ్బా న‌వ్వించాల‌న్నా అటు సీరియ‌ల్స్.. ఇటు టీడీ ప్రోగ్రామ్స్ ఎప్ప‌టిక‌ప్పుడు రెడీ ఉంటాయి. ముఖ్యంగా టీవీ ప్రోగ్రామ్స్ విష‌యానికి వ‌స్తే.. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ జోడీ, అదిరింది, పోవే పోరా, ప‌టాస్, క్యాష్‌ ఇలా ఒక‌టా.. రెండా.. ఎన్నో షోలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే ఆ సారి బుల్లితెర స్టార్స్ ఎవ‌రంటే.. పోవే పోరా సుడిగాలి సుధీర్, విష్ణు ప్రియ అని చెప్పాలి. ఈ వారం పోవే పోరా ఎపిసోడ్‌లో సుధీర్‌, విష్ణు ప్రియ చేసిన చేసిన త‌మ‌న్నా డాంగ్ డాంగ్ సాంగ్ హైలెట్‌గా నిలిచింది.

 

పోవే పోరా.. తెలుగు బుల్లి తెరకు కావాల్సినంత కామెడీతో అప్పుడప్పుడూ గాఢమైన రొమాన్స్‌ని, కొంచెం సెటైర్లని జత చేసి ఓ ఫ్లోలో సాగిపోయే షో ఇది.  యువతీ యువకుల కేరింతలతో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైనర్‌గా సాగిపోతోంది ఈ షో. తాజాగా ప్ర‌సార‌మైన‌ పోవేపోరా లో విష్ణుప్రియతో కలిసి రెచ్చిపోయి పర్ఫామ్ చేశాడు సుడిగాలి సుధీర్. ఇద్దరూ కలిసి సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని ‘లెట్స్ పార్టీ.. పార్టీ.. విత్ ది సాంగో.. గుర్తిండిపోవాలెహె లైఫ్ లాంగూ’ అంటూ డాంగ్ డాంగ్ సాంగ్‌కి అదిరిపోయే పెర్పామెన్స్ ఇచ్చారు.  

 

‘ఆజ్ మేరే ఘర్ మే పార్టీ హై తూ ఆజారా’ అని సుధీర్‌ని కవ్విస్తుంటే.. సుధీర్ సైతం ఓ రేంజ్‌ పెర్ఫామెన్స్ ఇస్తున్నారు. సుధీర్ స్టెప్పులు.. విష్ణ ప్రియ నాభిసోయగాలు.. సాంగ్ కాన్సెప్ట్ కిర్రాక్ అనేట్టుగానే ఉన్నాయి. వీరిద్దరి నైట్ పార్టీ సాంగ్‌కి లైక్స్, కామెంట్స్ వరదలా వస్తున్నాయి. అలాగే యూట్యూబ్‌లో సైతం ఈ షో వీక్ష‌కులు భారీగా పెరిగిపోతున్నారు. ఇలా ఈ వారం బుల్లితెర స్టార్స్‌గా సుడిగాలి సుధీర్, విష్ణు ప్రియ నిలిచారు. కాగా, బుల్లితెరలో రొమాంటిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా.. నువ్వెంతంటే నువ్వెంతంటూ కొట్టుకు చావాలన్నా సుధీర్, విష్ణు ప్రియలకే చెల్లుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: