ఈ వారం టాలీవుడ్ సెంట‌ర్ ఆఫ్ ద ఎట్రాక్ష‌న్ హీరోల గురించి చెప్పుకుంటే ఎన్టీఆర్ గురించి ముందుగా తీసుకుందాం. ఇక ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్. ఆర్‌.ఆర్ చిత్రం గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి నంద‌మూరి అభిమానులు తెలుసుకోడానికి ఎక్కువ‌గా గూగుల్ సెర్చ్‌లో ఎన్టీఆర్ అప్‌డేట్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ వారం గూగుల్ సెర్చ్‌లో ఎన్టీఆర్ పేరు ఎక్కువ‌గా ట్రెండ్ అయింద‌ని చెప్పాలి. అలాగే మోస్ట్ ట్రెండింగ్‌గా  సాగే ఈ టాపిక్ పై అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఫ్యాన్స్‌కి తెగ యాంగ్జైటీగా ఉంద‌ని చెప్పాలి. అయితే ఈ చిత్రం గురించి అప్‌డేట్ అంటే ఎన్టీఆర్ పుట్టిన‌రోజు నాడు ఆయ‌నకు సంబంధించిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. పోస్ట‌ర్ విడుద‌ల‌వుతుంద‌ని ఇటీవ‌లె ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్‌చేస్తోంది. 

 

ఇక త‌ర్వాత టాలీవుడ్ టాప్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈయ‌న ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నారు ఆయ‌న ఫ్యాన్స్‌. పింక్‌, క్రిష్ చిత్రాల‌తో తెగ బిజీగా ఉన్న ఆయ‌న ఈ రెండు చిత్రాలే కాక చాలా మ‌రో నాలుగు చిత్రాల్లో న‌టిస్తున్న విష‌యం కూడా తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం ప‌వ‌న్ వ‌రుస‌గా త‌న సినిమాల‌ను తెర‌కెక్కించే బిజీలో ఉన్నారు. ఇక ఒక‌వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు పాలిటిక్స్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఉద‌యం పూట సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ సాయంత్రం వేళ‌ల్లో ఆయ‌న పాలిటిక్స్ ప‌నిలో ఉంటున్నారు. ఇక ఇటీవ‌లె ఆయ‌న బిజెపితో పొత్తు పెట్టుకున్న సంగ‌తి తెలిసిన విష‌య‌మే. అయితే ఇటీవ‌లె ప‌వ‌న్ రాజ‌ధాని రైతుల‌ను క‌లిసి రాజ‌ధాని త‌ర‌లిపోకుండా ఆయ‌న పోరాడతానని మాట ఇచ్చారు. మొన్న క‌ర్నూలు వెళ్ళి ప్రీతి సుగాలి అనే అమ్మాయికి న్యాయం జ‌ర‌గాల‌ని కోరుకున్నారు. అలాగే రైతుల‌కు అండ‌గా నిలిచి పోర‌టానికి మ‌ద్ధ‌తు ప‌లికారు. ఇలా అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: