ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరూ అంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజ హెగ్డే. ప్రస్తుతం స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ కొట్టేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం దర్శకనిర్మాతలు అందరికీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పూజా హెగ్డే. మొన్నటికి మొన్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తో అలా వైకుంఠపురము లో సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతకుముందు మహర్షి అరవింద సమేత సినిమాలతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకుంది పూజాహెగ్డే. 

 

 ఇక ఇప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అక్కినేని హీరో అఖిల్ తో జోడి కట్టింది.  అయితే ఒక లైలా కోసం సినిమా తో నాగచైతన్యతో జోడి కట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే.అయితే ఒక లైలా కోసం సినిమా తో అన్న తో రొమాన్స్ చేసిన పూజ హెగ్డే ఇప్పుడు తమ్ముడు అఖిల్ తో కూడా రొమాన్స్ చేయబోతుంది. దీంతో పూజ అఖిల్ రొమాన్స్ ఎలా ఉండబోతుంది అనేది అటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. అయితే పూజా హెగ్డే కంటే ముందు నిధి  అగర్వాల్ ఇలా అక్కినేని బ్రదర్స్ సినిమాలో నటించింది. ఇదిలా  ఉంటే అప్పట్లో నాగచైతన్యతో  నటించిన సమయంలో నాగార్జున పూజా హెగ్డే పై పొగడ్తలు వర్షం కురిపించారు. పెద్ద స్టార్  అవుతావు అని చెప్పారు..నాగార్జున అన్నట్లుగానే ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా మారిపోయింది పూజ. 

 

 కాగా వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే... వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అఖిల్ కెరియర్ కి లక్కీ ఛార్మ్ గా  మారబోతుంది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. మరి ఈ సినిమా అయినా విజయం సాధిస్తుందో లేదో చూడాలి మరి. ఇదిలా ఉంటే ఇప్పటికే మొదట అన్న నాగచైతన్య తో రొమాన్స్ చేసిన పూజ హెగ్డే ఇప్పుడు తమ్ముడు అఖిల్ తో రొమాన్స్ చేస్తోంది. ఇక ప్రస్తుతం అక్కినేని హీరోల్లో  మిగిలి ఉన్నది నాగార్జున. ఒకవేళ నాగార్జున సినిమాల్లో కూడా ఛాన్స్ వచ్చి... పూజా హెగ్డే నటిస్తే అదిరి రికార్డు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: