హ్యాపీ సండే 16-FEB: ఈ వారం బుల్లితెర సూప‌ర్ యాంక‌ర్‌...! 
బుల్లితెర తెలుగు ప్రేక్షకుల్ని కొన్ని దశాబ్దాలుగా ఎన్నో కార్య‌క్ర‌మాలు అల‌రిస్తున్నాయి. సీరియల్స్ తో పాటు వీక్లి ప్రోగ్రామ్స్‌కు కూడా బుల్లితెర ప్రేక్షకులు ఎంత‌గానూ క‌నెక్ట్ అయ్యి ఉంటారు అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. గతంలో మాదిరిగా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ధియేటర్ల వైపు పరుగులు పెట్టడం లేదు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు. ఎందుకంటే.. వీరికి కావలసినంత వినోదం స్మాల్ స్క్రీన్ లో దొరుకుతుంది. సీరియల్స్, వీక్లి ప్రోగ్రామ్స్‌, సినిమాలు ఇలా బుల్లితెర ప్రేక్ష‌కులను ఎంత‌గానూ అల‌రిస్తున్నాయి. అందుకే స్మాల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ మీద చాలా డిమాండ్ ఉంది. 

 

ఇక తెలుగు టాప్ మోస్ట్ ఛానెల్స్ లో ఒకటి అయినటువంటి ఈటీవీ ఛానల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రసారం చేస్తున్నటువంటి క్యాష్ ప్రోగ్రాం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తెలుగు బుల్లితెరపై తన మాటల చాతుర్యంతో అందరి మనసు దోచిన యాంకర్ సుమ ప్రోగ్రామ్ అంటే ఎవ‌రైలా టీవీల‌కు అతుక్కుపోతారు. అలాగే ఈ  స్టార్ యాంకర్ సుమ వల్లే ఇప్పటికి కూడా క్యాష్ ప్రోగ్రామ్‌ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రతి శనివారం రాత్రి ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఎంత అల్లరిగా, ఆనందంగా సాగుతుందో మనందరికీ తెలిసిందే.

 

ఇక తాజా క్యాష్ ఎపిసోడ్‌లో ఈ స్టార్ యాంక‌ర్‌కు మ‌రో న‌లుగురు సీరియ‌ల్ స్టార్లు తోడై చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈ ప్రోగ్రామ్‌కు సుహాసిని, న‌వ్వ స్వామి, మెరీనా మ‌రియు శ్రావ‌ణి వ‌చ్చి యాంక‌ర్ సుమ‌తో తెగ హంగామ చేశారు. ఇక ప్రోమోతో ముందు నుంచి హైప్ క్రియేట్ చేయ‌డంతో యూట్యూబ్‌లో కూడా ఆ వారం ఎపిసోడ్ ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఈ బుల్లితెర‌పై ఎప్ప‌టిలాగానే త‌న మాట‌ల‌తో ఆక‌ట్టుకున్న‌ నేప‌థ్యంలో ఈ వారం కూడా బుల్లితెర సూప‌ర్ యాంక‌ర్ సుమ అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈమె తన మాటల ప్రవాహంతో చక్కని కట్టుబొట్టు, వాక్చాతుర్యంతో గత కొన్ని ఏళ్లుగా టాప్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఈ క్ర‌మంలోనే రెండు దశాబ్ధాలుగా ఈమె బుల్లితెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: