సినిమాల్లోకి వచ్చిన తర్వాత చేసినవి తక్కువ సినిమాలే అయినా సాయి పల్లవికి వచ్చిన గుర్తింపు మాత్రం అంతా ఇంతా కాదు. ఆమె హుషారుకి అందరూ ఫాన్స్ అయిపోయారు అనేది వాస్తవం. తక్కువ సినిమాలు చేసినా హుషారుగా ఉండటమే కాకుండా నటన, డాన్స్, తన వాయిస్, తన డబ్బింగ్ తానే చెప్పుకోవడం, ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే అవలీలగా చేయడం వంటివి ఆమెకు  మంచి పేరు తీసుకొచ్చాయి అనేది వాస్తవం. తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు గాని ఆమె చేసిన ఎంసిఏ, ఫిదా సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయనేది తెలిసిందే. 

 

తెలుగులో మూడు నాలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీనితో పాప క్రేజ్ కి కాస్త ఇబ్బంది వచ్చినా ఆమె ఎప్పుడు సినిమా చేస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూసేలా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే ఈమె ఇప్పటికే సినిమాకు కోటి వరకు తీసుకుంటుంది అని టాక్. అయితే ఆమె ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు పెద్దగా చేయలేదు. లిప్ లాక్ సీన్స్ అయినా సరే ఆమె చేయడానికి పెద్దగా సాహసం చేయదు. తనకు హాట్ హాట్ గా ఉండే సన్నివేశాలు అంటే చాలా చిరాకు అంటూనే... కొన్ని సినిమాలను ఆమె స్కిన్ షో చేయడం ఇష్టం లేక వదిలేసుకుంది కూడా. 

 

స్క్రిప్ట్ డిమాండ్ చేసినా కూడా నేను అవి చేయను అని ఆమె గతంలోనే చెప్పేసింది. ఇప్పుడు కూడా అదే చెప్తుంది. ఒక ఫేస్ క్రీం సంస్థ మాత్రం ఆమెతో ఒక యాడ్ చేయడానికి కోటి వరకు ఆఫర్ చేసినా నో చెప్పింది. తనకు డబ్బు ముఖ్యం కాదని సంతృప్తి ముఖ్యమని, ఎంత సంపాదించినా సరే తాను తినేది రోజు మూడు చపాతీలే అని చెప్పేస్తుంది. విలువలు చంపుకుని నేను బ్రతకలేను అంటూ డబ్బు కోసం తాను దిగజారే పరిస్థితిలో లేను అంటూ తెగేసి చెప్తుంది. అందుకే అలాంటి యాడ్స్ వచ్చినా సరే చేయను అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: