ఈ మధ్య సినిమా హిట్ అవ్వడం అంటే ఒకటే ఫార్ములా... ఆ సినిమా వంద కోట్ల వరకు వసూలు చెయ్యాల్సి ఉంటుంది. ఏ విధంగా చూసుకున్న సరే వంద కోట్లు వసూలు వస్తేనే సినిమా విజయం సాధించినట్లు అవుతుంది. లేకపోతే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఎక్కువ రోజులు ఆడే సినిమాలు అంటూ ఈ రోజుల్లో పెద్దగా ఏమీ లేవనే చెప్పాలి. కాని వంద కోట్ల వసూళ్ళు పది రోజుల్లో రావడంతో నిర్మాతలు కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి అదే విధంగా అడుగులు వేస్తూ ప్లాన్ చేస్తూ ముందుకి వెళ్తున్నారు. 

 

ఇక దర్శకులు కూడా అదే విధంగా కథలు సిద్దం చేసుకుని స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యాలని చూస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు యువ హీరోలు సినిమా చెయ్యాలని స్టార్ హీరో దగ్గరకు వెళ్తే వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. అది ఏంటీ అంటే, సినిమా స్టోరీ కమర్షియల్ గా ఉండాలి. కమర్షియల్ గా అయితేనే తాము సినిమా చేస్తామని మొహం మీదే చెప్పేయడంతో యువ దర్శకులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక సీనియర్ దర్శకులు కూడా ఇబ్బంది పడుతున్నారు. తమతో సినిమా చెయ్యాలి అంటే, వంద కోట్లు వచ్చే విధంగా ఉంటేనే చూడాలని అంటున్నారు. 

 

ఈ మధ్య మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అందరూ ఇదే ఫార్ములా అమలు చేస్తున్నారు. సినిమా ఎక్కువ వసూలు సాధిస్తే విజయంతో పాటు పరువు కూడా పెరుగుతుంది. కాబట్టి సినిమా లేట్ అయినా పర్వాలేదు గాని వంద కోట్లే మెయిన్ టార్గెట్ అంటున్నారట. దీనితో సినిమాకు దర్శకులు ఏళ్ళ తరబడి సమయం తీసుకుంటున్నారు. ఈ దెబ్బకు యువ దర్శకులు అయితే స్టార్ హీరోలతో సినిమా చెయ్యాలి అనే ఆలోచననే దాదాపుగా చంపేసుకుని వేరే వాళ్ళతో సినిమాలు ప్లాన్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: