షాలిని రెడ్డి 1989 సెప్టెంబర్ 27న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 30 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కందుకూరు ఆమె జన్మస్థలం. తన తల్లితండ్రులు ఇద్దరు వైద్యవృత్తికి చెందినవారు. షాలిని చిన్న వయస్సులోనే ఆమె ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. దీంతో హైదరాబాదులోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో షాలిని తన స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది.
ఆ తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం ఆమె లండన్‌కు వెళ్లి అక్కడ ఎంబీయే కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ఒక మల్టీ నేషనల్ కంపెనీలో హెచ్ఆర్లో ఉద్యోగం చేస్తోంది. కామన్ ఫ్రెండ్ వల్ల నితిన్ , షాలిని రెడ్డికి 2012లో స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఏదేమైనా నితిన్ - షాలిన్ పెళ్లితో ఈ రెండు కుటుంబాల మధ్య ఆంధ్రా - తెలంగాణ అనుబంధంగా మారింది.