నాగచైతన్య ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూల్ వచ్చినా ఒకేలా రియాక్ట్ అవుతుంటాడు. విజయం రాగానే హడావిడి చేయడం, నెగిటివ్ రిజల్ట్ వస్తే కుంగిపోవడం లాంటివి నాగచైతన్య జర్నీలో కనిపించవు. అలాంటి చైతన్యలవ్ స్టోరీ విషయంలో చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. భర్త ఉద్యోగం వచ్చాక కూడా ఆ లవ్ కు గిఫ్టులు ఇస్తున్నాడు. మరి చైతన్యని అంత డీప్ కి తీసుకెళ్లిన ఆ లవ్ కహానీ ఏంటో తెలుసా..?

 

నాగచైతన్య బెస్ట్ హస్బెండ్ అని సమంత చాలా సార్లు సర్టిఫికెట్ ఇచ్చింది. చైతన్య దొరకడం లక్ అని కూడా చెప్పింది. అంత ప్రేమ కురిపిస్తోన్న సమంత లైఫ్ లో ఉండగానే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో లవ్ స్టోరీ మొదలుపెట్టాడు చై. సాయి పల్లవితో కలిసి మిడిల్ క్లాస్ ప్రేమ కథలో నటిస్తున్నాడు. 

 

నాగచైతన్యకు శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ తెగ నచ్చేసిందట. శేఖర్ సృష్టించిన సాదాసీదా కుర్రాడి పాత్ర నుంచి అసలు బయటపడలేకపోతున్నాడని సమాచారం. దీనికి తోడు వాలంటైన్స్ డేకు వచ్చిన ఏయ్ పిల్ల సాంగ్ టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు నాగచైతన్య. ఈ ఆనందంలోనే శేఖర్ కమ్ములకు గాగుల్స్ గిఫ్ట్ గా ఇచ్చాడు చై. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు శేఖర్ కమ్ముల. మరో టీజర్ కు మరో గిఫ్ట్ రెడీ చేసుకోవాలని చైతన్యని ట్యాగ్ చేశాడు. 

 

నాగచైతన్య ఇప్పటి వరకు ఏ దర్శకుడికీ గిఫ్ట్ ఇవ్వలేదు. ఫస్ట్ టైమ్ శేఖర్ కమ్ములకు గాగుల్స్ ఇచ్చాడు. అది కూడా రిలీజ్ కు ముందే ఇచ్చాడు. సో ఈ కానుక చూస్తుంటే చై ఈ లవ్ స్టోరీపై చాలా నమ్మకంగా ఉన్నాడని చెప్పొచ్చు. మరి చైతూ నమ్మకానికి ఈ మూవీ ఏ రేంజ్ వసూళ్లు అందిస్తుందనేది తెలియాలంటే ఏప్రిల్ 2 వరకు వెయిట్ చేయాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: