దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈ సినిమా గ‌త దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది. పవర్ఫుల్ సబ్జెక్ట్‌తో వచ్చిన కార్తికి ఖైదీ సినిమాతో మరో హిట్టును త‌న ఖాతాలో వేసుకున్నాడు.  ఈ సినిమా కేవలం తమిళనాడులో కాకుండా తెలుగు, మలయాళ భాషలతో పాటు ఓవర్సీస్‌లో మంచి వసూళ్లను రాబ‌ట్టింది. రాత్రికి మొదలు పెడితే పొద్దున అయిపోయే కథ.. సూర్యున్ని చూడకుండానే శుభం కార్డ్ పడే కథ ఇది. 

 

వాస్త‌వానికి ఇలాంటి కథలు మన తెలుగులో రావడం అరుదు. ఆ రాత్రి వాళ్ల ప్రయాణమే ఈ చిత్ర కథ కూడా. కేవలం కొన్ని గంటల్లో జరిగే కథను లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక దీన్ని థ్రిల్లర్ అనాలో.. సస్పెన్స్ థ్రిల్లర్ అనాలో తెలియదు కానీ ఏదైనా కూడా స్క్రీన్ ప్లేతో పిచ్చెక్కించాడు. అయితే ఎప్పుడో రిలీజ్ అయిన ఖైదీ చిత్రం ఈ వారం ఫుల్ ట్రెండింగ్‌లో న‌డిచింది. ఎందుకంటే.. ఈ చిత్రం తాలూకా తెలుగు వెర్షన్ మాత్రం ఈరోజుల్లో అత్యంత పాపులర్ అయిన డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని తెలుగు ఆడియన్స్ ఎదురు చూసారు.

 

అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్,హాట్ స్టార్ ఇలా ప్రతీ ఒక్కరినీ పదే పదే అడుగుతుండడంతో ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ గా మారింది. కాని, ఎవ‌రు ఊహించ‌ని విధంగా  గీతా ఆర్ట్స్ వారు ప్రారంభించిన స్ట్రీమింగ్ యాప్ “ఆహా” ద్వారా సొంతం చేసుకున్నారు. అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ చిత్రానికి వీరు ఈ వారం గట్టిగానే ప్రమోషన్స్ చేశారు. .మాములుగా టెలివిజన్ లో ఏదన్నా సరికొత్త సినిమాను ప్రసారం చేసేటప్పుడు ఆయా ఛానెల్స్ వారు “వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్”అంటూ ప్రమోట్ చేస్తారు.అలాగే ఈ చిత్రానికి కూడా “వరల్డ్ డిజిటల్ ప్రీమియర్” అంటూ సరికొత్తగా ప్రమోట్ చేశారు. దీంతో ఈ చిత్రం ఫుల్ ట్రెండ్ అయింది. ఇక నిన్న‌టి నుంచి(ఫిబ్రవరి 15) ఆహా యాప్ ద్వారా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: