కోల్పోయిన స్టార్ డమ్ కోసం చెన్నై బ్యూటీ శృతి హాసన్ తిప్పలు పడుతోంది. బ్రేకప్ తో యూటర్న్ తీసుకున్న కమల్ గారాల పట్టి మళ్లీ సినిమాలు చేస్తోంది. కమ్ బ్యాక్ కోసం ఆశపడుతున్న ఈ బ్యూటీకి ఇప్పుడు  ఓ టెన్షన్ పట్టుకుందట. ఛాన్స్ ఇచ్చిన ఆ స్టార్ తనకైనా హిట్ ఇస్తాడా లేదా అని డౌట్ పడుతోందట. 

 

శృతిహాసన్ కెరీర్ సర్కిల్ కొడుతోంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ అటు నుండి కోలీవుడ్, మళ్లీ బాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ కు వచ్చేసింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లో ఫారెన్ కుర్రాడు మైఖేల్ కోర్సలే మాయలో పడి సినిమాలు వదిలేసింది. తీరా ఏవో కారణాలతో బ్రేకప్ అయ్యారు. ఆ తర్వాత పాప్ స్టార్ గా నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు శృతిహాసన్ సినిమాలతో మునుపటి క్రేజ్ దక్కించుకోవాలని చూస్తోంది. 

 

ప్రస్తుతం శృతిహాసన్, రవితేజకు జోడీగా క్రాక్ సినిమాలో నటిస్తోంది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై చెన్నై బ్యూటీ బోలెడు ఆశలు పెట్టుకుంది. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన బలుపు బంపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇటీవల ఇలియానాకు అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో ఛాన్సిచ్చిన రవితేజ సక్సెస్ మాత్రం ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు తనకు కూడా అలాగే హ్యాండ్ ఇస్తాడా అనే డౌట్ శృతికి పట్టుకుందట. 

 

ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాో ఇతర హీరోయిన్స్ లాగే శృతిహాసన్ కూడా క్రేజ్ కోసం పాకులాడుతోంది. వరుసగా ఈ అమ్మడు రకరకాల ఫోటో షూట్లను షేర్ చేస్తోంది. తాజాగా పింక్ గులాబీని పెదవుల మధ్య పట్టుకున్న ఫోటోను శృతి షేర్ చేసింది. పూర్తిగా పింక్ ఊల్ షర్ట్ లో సింపుల్ లుక్ తో ఉన్న ఫోటోను అభిమానులకు షేర్ చేసింది. ఈ ఫోటోతో శృతిలోని నేచురల్ బ్యూటీ బయటపడిందని చెప్పొచ్చు. ఆడియన్స్ దృష్టిలో పడేందుకు చెన్నై బ్యూటీ ఏవేవో తిప్పలు పడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: