తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైన విషయం తెలిసిందే. విడుదలకు ముందే 96 సినిమాను చూసిన దిల్ రాజు సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావించి 96 సినిమా హక్కులను కొన్నారు. ఈ సినిమాను తెలుగులో శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా 96 డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో జాను పేరుతో తెరకెక్కించగా ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. 
 
సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ యువతలో చాలామంది ఇప్పటికే తమిళ్ వెర్షన్ చూసి ఉండటం తమిళం, తెలుగుకు పెద్దగా మార్పులూచేర్పులూ లేకపోవడంతో జాను సినిమాపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. బాక్సాఫీస్ దగ్గర పోటీగా సినిమాలేవీ లేకున్నా జాను మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఫిబ్రవరి 7వ తేదీన విడుదలైన ఈ సినిమాకు 9 రోజుల్లో కేవలం ఆరున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. 
 
ఓవర్సీస్ లో అయితే జాను సినిమా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. క్లాస్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే ఓవర్సీస్ లో జాను తొలి వీకెండ్ లోనే డిజాస్టర్ అనిపించుకుంది. జాను సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 21కోట్ల రూపాయల బిజినెస్ కాగా కేవలం ఆరున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు రావడంతో సినిమాకు భారీగా నష్టాలు రావడం తప్పవని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 
ఈ మధ్య కాలంలో దిల్ రాజు బ్యానర్లో ఈ స్థాయిలో నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా మరొకటి లేదని తెలుస్తోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ కెరీర్లో జాను సినిమాతో మరో ఫ్లాప్ యాడ్ అయింది. సమంతలాంటి స్టార్ హీరోయిన్ నటించినా సినిమాకు భారీ నష్టాలు రావడం గమనార్హం. శుక్రవారం రోజు విడుదలైన వరల్డ్ ఫేమన్ లవర్ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా జాను సినిమా కలెక్షన్లు పుంజుకోకపోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: