భారీ డిజాస్టర్ తో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అవకాశాలకు దూరమయ్యాడు. ఈ క్లీన్ మూవీస్ డైరెక్టర్ మళ్లీ బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం క్రేజీ రిమేక్ హ్యాండిల్ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల మరో క్రేజీ ఛాన్స్ పట్టేసినట్టు సమాచారం. 

 

కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు, ముకుంద చిత్రాలతో శ్రీకాంత్ అడ్డాల క్లీన్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడు సినిమాలతోనే ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న ఈ క్లాస్ డైరెక్టర్ మహేశ్ బాబు హీరోగా చేసిన బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఈ దర్శకుడితో సినిమా అంటేనే హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది. ఈ డిజాస్టర్ తో మూడేళ్ల పాటు ఛాన్స్ లు లేకుండా ఖాళీగా ఉన్న శ్రీకాంత్ అడ్డాల మళ్లీ క్రేజీ ఛాన్స్ అందుకున్నాడు. 

 

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల, సీనియర్ స్టార్ వెంకటేశ్ తో అసురన్ రిమేక్ నారప్పను తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రీమేక్ సెట్స్ పై ఉండగానే శ్రీకాంత్ అడ్డాల మరో క్రేజీ ఛాన్స్ దక్కించుకున్నట్టు టాక్. 14రీల్స్ బ్యానర్ లో వరుణ్ తేజ్ హీరోగా ఓ మూవీకి ప్లానింగ్ జరుగుతోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళుతోందని సమాచారం. 

 

ముకుంద చిత్రంతో శ్రీకాంత్ అడ్డాల, వరుణ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ విశ్వాసంతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో క సినిమాను చేసేందుకు వరుణ్ సిద్ధం అయినట్టు సమాచారం. ఇటీవల ఈ దర్శకుడు వరుణ్ తేజ్ కు ఓ స్టోరీ లైన్ చెప్పినట్టు వినికిడి. గత ఏడాది 14రీల్స్ లో నటించిన గద్దలకొండ గణేశ్ మంచి సక్సెస్ అవ్వడంతో పాటు వరుణ్ తేజ్ కు మాస్ హీరోగా గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో నటిస్తున్న మెగా ప్రిన్స్ ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో మూవీ చేస్తాడని టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: