నేచురల్ స్టార్ నాని , యంగ్ హీరో సుధీర్ బాబు ల మల్టీ స్టారర్ చిత్రం వి విడుదలకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుండి ఇటీవల నాని ,సుధీర్ బాబు ల ఫస్ట్ లుక్ ను విడుదలను చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు టీజర్ ను విడుదలచేయనున్నారు. రేపు సాయంత్రం 5గంటలకు ఈ టీజర్ విడుదలకానుంది. ఈ టీజర్ కొరకు నాని అభిమానులు ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు వరకు వినోదం తో కూడిన  సినిమాలను తెరకెక్కించిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి  మొదటి సారి వి తో యాక్షన్ జోనర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
 
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  నాని విలన్ పాత్రలో కనిపించనుండగా సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సైరా ఫేమ్ అమిత్ త్రివేదిసంగీతం అందిస్తుండగా  థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  అందిస్తున్నాడు. ఉగాది కానుకగా మార్చి 25న విడుదలకానుంది. కాగా నానికి ఇది 25వ సినిమా. మరి 25వ తేదిన వస్తున్న ఈ 25వ చిత్రం నానికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈసినిమా తరువాతర నాని ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో టక్ జగదీష్ అనే చిత్రం లో నటిస్తుండగా మరో హీరో సుధీర్ బాబు మాత్రం వి తరువాత ఇంతవరకు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే బ్యాట్మెంటన్ స్టార్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో సుధీర్ బాబు నటించాల్సి వుంది. బహుశా వి విడుదల తరువాత ఆ సినిమా మొదలు పెడతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: