నిన్నటి వరకు సింగిల్ లైఫ్ తో మెంటల్ ఎక్కుతోందని తెగ బాధపడ్డాడు నితిన్. వాలంటైన్స్ డే ను సింగిల్ గా సెలబ్రేట్ చేసుకోవడం నరకం అని శాడ్ సాంగ్స్ కూడా పాడుకున్నాడు. కానీ ఇప్పుడిక ఈ కష్టాలన్నీ తీరిపోతున్నాయి. నితిన్ బ్యాచిలర్ స్టోరీకి శుభం కార్డు పడింది. 

 

నితిన్ పెళ్లి పనులు మొదలయ్యాయి. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ షాలినీతో లైఫ్ షేర్ చేసుకునేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు నితిన్. ఏప్రిల్ 15న దుబాయ్ లో నితిన్, షాలినీ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. శనివారం నితిన్ పెళ్లపనులు మొదలయ్యాయి. మ్యూజిక్ స్టార్ట్స్.. మీ బ్లెస్సింగ్ కావాలి అని ఎంగేజ్ మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు నితిన్. 

 

నితన్ ఎంగేజ్ మెంట్ ఫోటోలు షేర్ చేయగానే సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ కూడా వస్తున్నాయి. వాలంటైన్స్ డే రోజునే సింగిల్ లైఫ్ శాపం అని పాడుకున్నాడు. తర్వాతి రోజునే ఎంగేజ్ మెంట్ ఫోటోలు షేర్ చేశాడు. నితిన్ ఫుల్ స్పీడ్ అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. 

 


నితన్, షాలినీ 2012 నుంచి ఫ్రెండ్స్. రెండేళ్ల క్రితం నితిన్, షాలినీకి ప్రపోజ్ చేశాడు. అయితే ఈ ప్రపోజ్ కూడా చాలా సినిమాటిక్ గా జరిగిందట. నితిన్ సినిమాటిక్ గా ఒంటికాలిపై షాలినీకి ప్రపోజ్ చేశాడు. ఈ వింత ప్రపోజల్ కు ఆశ్చర్యపోయిన షాలినీ వెంటనే ఒకే చెప్పేసింది. ఇప్పుడు నితిన్ తో కలిసి పెళ్లి పీటలెక్కుతోంది. ఇక నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ థియేటర్లలోకి వెళ్లిపోగానే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తాడట నితిన్. మొత్తానికి నితిన్ ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. ఇష్టమైన..మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లిచేసుకుంటున్న నితిన్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: