మాటల  మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూడో సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై, సూపర్ హిట్ అయింది. ఇక వసూళ్ళ పరంగా చూసుకుంటే ఈ సినిమా చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఇప్పటికి కూడా ఈ సినిమా దూకుడు కొనసాగుతుంది అంటే ఏ స్థాయిలో హిట్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. 

 

ఇక ఈ సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రతీ పాట హైలెట్ గా నిలిచింది. తొలి పాట విడుదల దగ్గర నుంచి సినిమాలో ఉన్న ప్రతీ పాట, అటు మాస్, ఇటు క్లాస్ ని విశేషంగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఇప్పటికే మాస్ నోళ్ళలో ఈ సినిమా పాటలు నానుతూనే ఉన్నాయి. అటు లవర్స్, ఇటు వినోదం ప్రియులు ఇద్దరూ కూడా ఈ సినిమాలో పాటలను వింటూనే ఉన్నారు. సామజవరగమన, రాములో రాములా, బుట్ట బొమ్మా ఇలా ప్రతీ ఒక్కటి కూడా సినిమాకు హైలెట్ గా నిలిచాయి అనే చెప్పవచ్చు. 

 

'సామజవరగమన', 'రాములో రాములా' పాటలైతే యూత్ ని ఒక ఊపు ఊపేశాయి అనేది వాస్తవం. యుట్యూబ్ ని కూడా ఇవి షేక్ చేసాయి అనే చెప్పవచ్చు. మెలోడియస్ గా సాగిన 'సామజవరగమన' మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. మాస్ ని ఆకట్టుకున్న పార్టీ సాంగ్ 'రాములో రాములా' పల్లె టూర్లలో ఎక్కువగా వినపడుతుంది. ఈ సాంగ్ యూ ట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ పొందింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ పాట హైలెట్ అనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: