మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడిగా, అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమాలో ప్రతీ పాట కూడా హైలెట్ గా నిలిచింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పుడు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫా౦ యుట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా పాటలు అన్నీ ఆ ఫ్లాట్ ఫాం లో హైలెట్ గా నిలుస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఆ పాటల హవా అంతా ఇంతా కాదనే చెప్పాలి. 

 

ముఖ్యంగా సామజవరగమనా... నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు, నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు.. అంటూ సాగే ఈ పాట లిరిక్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఈ పాట సినిమాలో విజివల్ వండర్ గా నిలిచింది అనే చెప్పాలి. ఈ లిరకల్ సాంగ్‌ ఫాన్స్ ని ఊపెస్తుంటే తాజాగా ‘సామజవరగమన’ పూర్తి వీడియో సాంగ్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం యుట్యూబ్ లో విడుదల చేసింది. 

 

సిద్ శ్రీ రాం పాడిన ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నల సీతారామన్ శాస్త్రి సాహిత్యం అందించారు. దాదాపు మూడు గంటల క్రితం విడుదల అయిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా హడావుడి చేస్తుంది. విడుదల అయిన మూడు గంటల్లోనే దాదాపుగా 7 లక్షల వ్యూస్ సాధించి దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా వసూళ్ళ గురించి అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. పాటలు కూడా సూపర్ హిట్ అవ్వడం సినిమాకు మరింతగా కలిసి వచ్చింది అనే చెప్పుకోవచ్చు. మీరు కూడా పాటను ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: