ఈశా రెబ్బా... మన తెలుగు అమ్మాయి. అందానికి అందం, అభినయానికి అభినయం, నటనకి నటన... ఏ విధంగా చూసినా సరే చాలా మంది హీరోయిన్ల కంటే ఈ అమ్మాయి టాప్ లోనే ఉంటుంది. స్టార్ హీరోలతో చేసే రేంజ్ ఈ అమ్మాయికి ఉన్నా సరే దర్శక నిర్మాతలు మాత్రం ఈ అమ్మాయి విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నారు. అవకాశం ఇస్తే సెకండ్ హీరోయిన్ గా ఇస్తున్నారు లేదా అసలు ఇవ్వడం లేదు. పేరు పరిశీలించి వదిలేస్తున్నారు గాని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె కు తెలుగు లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదనే అభిప్రాయం ఎక్కువగా వినపడుతుంది. అందం ఉన్నా, తెలుగు చక్క గా వచ్చినా సరే ఈ అమ్మాయి కి అవకాశాలు మాత్రం కరువైపోయాయి అనే చెప్పుకోవచ్చు. దీనితో ఆమె అభిమానుల తో పాటు తెలుగు భాషా ప్రియులు కూడా ఆమె కు ఆదరణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది తప్పు అని సిని నిర్మాతలను దర్శకులను తిడుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మాయి చేతిలో ఒకటో రెండో సినిమాలు ఉన్నా అవి పెద్దవి కాదు. 

 

అరవింద సమేతలో సెకండ్ హీరోయిన్ గా అంటే హీరోయిన్ చెల్లెలిగా నటించినా సరే గుర్తింపు రాలేదు. ఆ సినిమాలో హావభావాల విషయంలో ఈ అమ్మాయి పూజ కంటే బాగా చేసింది అని కనీసం అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇక సోషల్ మీడియాతో పాటుగా ఈ మధ్య ఫోటో షూట్ లో అందం ఏ స్థాయిలో ఆరబోస్తున్నా అవకాశాలు మాత్రం ఈమెను వరించే పరిస్థితి కనపడటం లేదు. దీనితో ఆమె దర్శకుల వెంటపడుతుంది. తన ఫోటోల ద్వారా తాను అందాలను ఆరబోస్తా అని చెప్పినా సరే ఎవరూ ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదని, ఇది అన్యాయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: