'అర్జున్ రెడ్డి' సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా చేయక ముందు పెళ్లిచూపులు సినిమాతో క్లాసికల్ హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ..ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసిన అర్జున్ రెడ్డి కి బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. సినిమాలో విజయ్ దేవరకొండ చూపించిన యాటిట్యూడ్ మరియు మేనరిజం యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. భయంకరమైన క్రేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత చేసిన ‘గీత గోవిందం’ సినిమాతో కూడా మంచి క్లాసికల్ హిట్ అందుకున్నాడు. దీంతో మరింత ఫాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడంతో విజయ్ దేవరకొండ కూడా తను చేసిన సినిమాల ప్రమోషన్ విషయంలో తిరుగులేదు అన్న రీతిలో వ్యవహరించేవాడు.

 

అయితే చేస్తున్న సినిమాలు మొత్తం వరుసగా ప్లాప్ కావటంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ ఎప్పుడైతే ట్రోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయినా కానీ పెద్దగా పట్టించుకోని విజయ్ దేవరకొండ సినిమాలు చేస్తూనే ఉన్నారు ...కానీ చేసిన సినిమా ఏది కూడా హిట్ అవ్వలేదు. దీంతో చాలా వరకు తగ్గి క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సరికొత్త ప్రేమ కథా చిత్రమైన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా చేయడం జరిగింది. నలుగురు హీరోయిన్లతో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా తో ఎలాగైనా హిట్ కొట్టాలని ఫ్యాన్స్ భావించారు. అయితే సినిమాలో విషయం లేకపోవడంతో పాటు స్టోరీ లవ్ స్టోరీ కలిగిన సినిమా అవటంతో డైరెక్షన్ కూడా సరిగా లేకపోవడంతో మొట్టమొదటి రోజే ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

 

దీంతో వసూళ్ళ పరంగా ఈ సినిమా విజయ్ దేవరకొండ గత సినిమాల కంటే మార్కెట్ పడిపోయినట్లు అన్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా 5.5 కోట్ల షేర్ రాబట్టింది. విజయ్ దేవరకొండ గత చిత్రాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఇక రెండవరోజు ఈ చిత్ర వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నెగిటివ్ టాక్ ఎక్కువవుతుండడంతో రెండవ రోజు ఈ చిత్రం 2.4 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తం రెండు రోజుల్లో ఈ చిత్రం 8 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో ఈ లెక్కల బట్టి విజయ్ దేవరకొండ కెరియర్ కి ప్రమాదం వాటిల్లనట్లే అని ఇప్పటికైనా విజయ్ దేవరకొండ కళ్ళు తెరిచి సరిగ్గా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని ఇండస్ట్రీకి చెందిన వారు కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: