టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం బాలీవుడ్ మూవీ పింక్ అధికారిక తెలుగు రీమేక్ ప్రస్తుతం జోరుగా షూటింగ్ ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. నివేత థామస్, అంజలి, అనన్య ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ గా ఒక ప్రముఖ లాయర్ గా నటిస్తున్నారు. ఇక దీని తరువాత క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీలో పవన్ నటించనున్న విషయం తెలిసిందే. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎమ్ రత్నం నిర్మాతగా రూపొందనున్న ఈ సినిమాను ఎంతో గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నట్లు టాక్. 

 

ఇక దీని తరువాత గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను పవన్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కొన్నేళ్ల క్రితం పవన్ తో తమ్ముడు, బద్రి, జానీ, అన్నవరం సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ని అందించిన రమణ గోగుల సంగీతాన్ని అందించనున్నట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. నిజానికి పవన్ తో ఆయన పని చేసిన ఈ నాలుగు సినిమాల మ్యూజిక్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేయడం జరిగింది. 

 

ఇటీవల కొన్నేళ్లుగా విదేశాల్లో తన ఫ్యామిలీతో కలిసి జీవిస్తున్న రమణ గోగులను ఈ సినిమా ద్వారా మరొక్కసారి టాలీవుడ్ కి తీసుకురావాలని పవన్ యోచిస్తున్నారట. నిజానికి ఆయనతో పవన్ కు మంచి సాన్నిహిత్యం ఉండడంతో పవన్ కోరితే రమణ మళ్ళి టాలీవుడ్ కి వచ్చే అవకాశం కనపడుతోందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, ఇది ఒకరకంగా పవన్ ఫ్యాన్స్ కి పండుగ వార్తే అని చెప్పాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: