ప్రేమికుల రోజు సందర్భంగా విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటించిన సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొట్ట మొదటి రోజు అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాలు నలుగురు హీరోయిన్లు విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెరిగిపోయాయి. ముఖ్యంగా గతంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు మొత్తం వరుసగా ఫ్లాప్ కావటంతో ఈ సినిమాతో విజయం సాధిస్తారని విజయ్ దేవరకొండ అభిమానలు ఆశించారు. అయితే తీరా సినిమా విడుదలయ్యాక ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ నిరుత్సాహానికి గురయ్యారు.

 

క్రాంతి మాధవ్ దర్శకత్వం విఫలం కావడంతో పాటు సెకండాఫ్ మొత్తం పూర్తి డల్ గా చూపించడంతో సినిమా ప్రేక్షకులు ఫుల్ నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో సినిమాకి సంబంధించి కలెక్షన్ విషయంలో మరింతగా విజయ మార్కెట్ పడిపోయినట్టు గా కలెక్షన్ వచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాకి సంబంధించి విడుదలకు ముందు బిజినెస్ భయంకరంగా జరిగింది. కానీ సినిమా విడుదలయ్యాక బయ్యర్లు సినిమాకి వచ్చిన పరాజయం టాక్ కి కలెక్షన్లు రాకపోవడంతో నిండా మునిగి పోయారట. సినిమా రిలీజ్ కు ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 23 కోట్ల బిజినెస్ జరగగా ఇప్పటి వరకు కేవలం 5.9 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది.

 

దీనితో ఫుల్ రన్ లో మహా అయితే 10 కోట్లు రాబట్టొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.ఇక్కడ పరిస్థితే ఇలా ఉంటే ఓవర్సీస్లో మహా దారుణంగా ఉందని ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతానికి సినిమా కి ఆదరణ లేకపోవడంతో సినిమా కి పెట్టిన డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఫిలింనగర్ లో వార్తలు భయంకరంగా వినబడుతున్నాయి. దీంతో విజయ్ దేవరకొండ మార్కెట్ వరుసపెట్టి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ సినిమాలు రావడంతో మరింత దారుణంగా విజయ్ దేవరకొండ కలెక్షన్ పడిపోయినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: