టాలీవుడ్ హీరోలు ఇప్పుడు వరుసగా మల్టీ స్టారర్ సినిమాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఆ సినిమాలకు మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో భవిష్యత్తులో మంచి వసూళ్లు సాధించాలి అంటే మాత్రం ఈ సినిమాలు బాగా ప్లస్ అవుతాయని, అభిమానులు అందరూ సినిమా చూడటమే కాకుండా కాంబినేషన్ కూడా నచ్చి అందరూ సినిమా చూసే అవకాశం ఉందనే హీరోలు భావిస్తున్నారట. అందుకే స్టార్ దర్శకులు ఎవరైనా మంచి కథతో వస్తే సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. 

 

ఈ నేపధ్యంలోనే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. అల్లు అర్జున్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరు కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలు కూడా. అందుకే ఈ ఇద్దరు సినిమా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం చాలా మంది నుంచి వినపడింది. ఎప్పుడో ఈ వార్త బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి అల్లు అర్జున్ ఆసక్తి చూపిస్తున్నాడని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

 

సినిమా కూడా ఒక స్టార్ దర్శకుడితో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆ స్టార్ దర్శకుడు ఎవరో కాదు, త్రివిక్రమ్ అనే మాట వినపడుతుంది. త్రివిక్రమ్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఆ సినిమా కథ కోసం ఎక్కువ టైం దొరకడంతో కాస్త కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ముందు బాలకృష్ణ తో అనుకున్నా జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి చూపించకపోవడంతో త్రివిక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది. దీనికి అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సుకుమార్ సినిమాతో పాటుగా ఈ సినిమాను చేస్తాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: