ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాత గా మారిపోయి సినిమాలు చేస్తుంది ఛార్మీ కౌర్. ఇక నటన కు ఈమె దూరమై చాలా రోజులు అయింది.  పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి  ప్రస్తుతం ఆకాశ్‌ పూరి ‘రొమాంటిక్‌’ , విజయ్‌ దేవరకొండ ‘ఫైటర్‌’చిత్రాలను చేస్తుంది ఈ మాజీ హీరోయిన్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా ఫైటర్ సినిమాతో ఈమె చాలా బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా పూర్తి చేసి వేగంగా విడుదల చెయ్యాలని ఛార్మీ, పూరి భావిస్తున్నారు. 

 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నుంచి ఈమెకు కాస్త విరామం దొరికింది. దీనితో ఆ విరామాన్ని భాగానే ఎంజాయ్ చేస్తుంది ఛార్మి. ఈ తరుణంలో తాను ఎంతో ముద్దుగా పెంచుకునే కుక్కతో ఆడుకుంది ఈమె. ఆ కుక్కతో దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది ఆమె. పదేళ్లు ఉంటే అందం పోతుంది.. కానీ జీవితాంతం ఆనందంగా చూసుకునే వారు పక్కన ఉంటే అదే చాలు అంటూ ఆమె పోస్ట్ చేసింది. దీనితో ఈ ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

అదే విధంగా తన ఇంట్లోకి కొత్త నేస్తం వచ్చింది అని చెప్తూ సందడి సందడి చేస్తుంది ఈమె. ఈమె కు కుక్కలు అన్నా, ఇతర పెంపుడు జంతువు లు అన్నా సరే చాలా ఇష్టమని పలు ఇంటర్వ్యూ లలో ఛార్మీ చెప్పింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఫాం లోకి వచ్చిన పూరికి అన్ని విధాలుగా సహకరిస్తూ చార్మీ ముందుకి వెళ్తుంది. తన వంతు సహాయ౦ చేస్తూ వస్తుంది. ఇక కొత్త హీరోయిన్ల ను ఎంపిక చేసే విషయంలో కూడా చార్మీ ముందు ఉంటుంది. పూరి సినిమాల్లో కొత్త హీరోయిన్ల కు అవకాశాలు ఇస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: