దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రెబల్ స్టార్ ప్రభాస్.. రానాలతో 'బాహుబలి' సినిమాని తెరకెక్కించి మన తెలుగు సినిమా స్టామినాని చూపించారు. ఈ ఒక్క సినిమాతో జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు... రివార్డులతో జక్కన్న పేరు మార్మోగింది. రాజమౌళి అంటే ఇండియాలో తెలుగు సినిమాకి ఓ బ్రాండ్ అన్న రేంజ్ ని సాధించారు. పాన్ ఇండియా డైరెక్టర్ హోదా దక్కించుకున్న జక్కన్న ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ప్రతిష్టాత్మకంగా ఆర్.ఆర్.ఆర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు విప్లవ యోధులైన అల్లూరి సీతారామరాజు.. కొమురం భీమ్జీవిత కథలను ఆధారంగా చేసుకుని ఫిక్షన్ బేస్డ్ గా ఆర్.ఆర్.ఆర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడం విశేషం.

 

అయితే ఇప్పుడు బాహుబలి సినిమా కంటే ఎక్కువ ఒత్తిడిని రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా విషయంలో పడుతున్నారట. ఆ సినిమా తెరకెక్కించినప్పుడు అంచనాలు వేరు కాబట్టి రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యోవరకు అంతగా టేన్షన్ పడలేదట. ఎలాంటి కలెక్షన్స్ వస్తాయి. ఎన్ని రికార్డ్స్ సృష్ఠిస్తుంది ..ప్రపంచ స్థాయిలో సినిమాకి గుర్తింపు దక్కుతుందా అన్న ఆలోచనలేవీ మైండ్ లో లేకుండా బాహుబలి సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించి ప్రపంచ స్థాయిలో సక్సస్ ని సాధించారు. అయితే ఇప్పుడు అదే రాజమౌళి కి శాపం గా మారిందని టాక్ వినిపిస్తోంది.

 

ఆర్.ఆర్.ఆర్ అనౌన్స్ చేన దగ్గర నుంచి రాజమౌళి విపరీతమైన ఒత్తిడిని అనుభవిస్తున్నట్లు తెలిస్తోంది. ఎందుకంటే చరణ్ ని ఎలా చూపించబోతున్నారు, తారక్ ని ఎలా చూపించబోతున్నారు అని ఇప్పటికే ప్రేక్షకుల్లో అలాగే చరణ్, తారక్ అభిమానుల్లో ఉత్కంఠత నెలకొంది. ఇదంతా ఒక ఎత్తైతే బాహుబలి వంటి సక్సస్ ని అందుకోవాలని ఇంకా చెప్పాలంటే ఆ సినిమాకి మించి ఆర్.ఆర్.ఆర్ ఉండాలని అందరూ రాజమౌళి పై ఒత్తిడి తెస్తున్నారట.

 

దాంతో గతకొన్ని రోజులుగా ఈ విషయంలో మదనపడుతూ అనవసరంగా బాహుబలి తీశాను. ప్రతీ సినిమా బాహుబలి లా తీయాలంటే ఎలా కుదురుతుంది. ఏ కథ కి ఉండే ప్రత్యేకత ఆ కథకి ఉంటంది..నేను తీసే ప్రతీ సినిమాని బాహుబలి సినిమాతో పోల్చితే ఆ ఒత్తిడి నేనే కాదు ఏ డైరెక్టర్ తట్టుకోలేడని అంటూన్నారట. నిజమే కదా మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: