‘సినిమాకు భాషే వేరు.. భావం ఒకటే..’ అనేది సినిమా వర్గాల మాట. అందుకే ఓ భాషలో హిట్టైన సినిమాను మరో భాష వారు రీమేక్ రైట్స్ కొనుక్కొని అక్కడి హీరోలతో చేస్తూంటారు. ఇందులో మన టాలీవుడ్ కి మినహాయింపేమీ లేదు. పైపెచ్చు.. మనోళ్లకి రీమేక్స్ తీసుకోవటం చాలా ఇష్టం. ప్రస్తుతం మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఓ మళయాళ సినిమా రీమేక్ రైట్స్ కొన్నాడు. లూసిఫర్ అనే సినిమా కొన్నాడు.. పాత న్యూస్ అనుకోవడానికి లేదు.. మరో మళయాళ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ ను కొన్నాడట.

 

 

డ్రైవింగ్ లైసెన్స్ లో పృథ్వీరాజ్ సుకుమారన్, లూసిఫర్ లో మోహన్ లాల్ హీరోలుగా నటించారు. రెండు సినిమాలు అక్కడ సూపర్ హిట్ అయ్యాయి. కథ, కథనాలు నచ్చడంతో రామ్ చరణ్ వెంటనే రీమేక్ రైట్స్ కొన్నాడట. ఈ సినిమా ఎవరితో ఎప్పుడు చేస్తాడో.. అసలు ఎవరి కోసం ఈ రీమేక్ కొన్నాడో కూడా ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ తన సినిమాలను లైన్ పెడుతున్నాడనే టాక్ ఉంది. ఇందుకు సందీప్ రెడ్డి వంగా, సుజిత్, అనిల్ రావిపూడి, కొరటాల శివ.. వంటి దర్శకుల కథలు వింటున్నాడని కూడా టాక్ ఉంది. ఎవరితో సినిమా చేస్తాడో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చాక కానీ క్లారిటీ రాదు.

 

 

కానీ.. ఇలా చరణ్ వరుసగా మళయాళ సినిమాల మీద పడ్డాడేంటా అనేది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మనవాళ్లు తమిళ సినిమా హక్కులనే ఎక్కువగా కొంటూ ఉంటారు. అలాంటిది.. చరణ్ వరుసగా రెండు మళయాళ సినిమా రీమేక్స్ తీసుకోవడం విశేషమే. లూసిఫర్ సినిమాను చిరంజీవి కోసమే కొన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి డ్రైవింగ్ లైసెన్స్ మూవీపై దర్శకుడిపై క్లారిటీ రావాల్సి ఉ:ది.

మరింత సమాచారం తెలుసుకోండి: