అశ్వనీదత్ అల్లుడు టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం మార్మోగిపోయింది. మొదటి సినిమా తీసినప్పుడు ఈయన ఎవరో ఎవరీకి అంతగా తెలీదు. అందుకు కారణం ఆయన తీసిన ఎవడే సుబ్రమణ్యం విమర్శకుల ప్రశంసలు అందుకుంది గాని కమర్షియల్ గా మాత్రం సక్సస్ ని ఇవ్వలేకపోయింది. అందుకే నాగ్ అశ్విన్ పేరు ఎవరీకి గుర్తు లేదు. కాని ఎప్పుడైతే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమాని తెరకెక్కించాడో ఒక్కసారి ఇండస్ట్రీ మొత్తం షాకయింది. ఇలాంటి డైరెక్టర్ ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు అంటూ ఆశ్చర్యపోయింది. అంతేకాదు పలువు సినీ ప్రముఖులు నాగ్ అశ్విన్ పుట్టు పూర్వోత్తరాల గురించి ఆరా తీశారు.

 

ఇక మహానటి సినిమాని టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజయ్యాక చిత్ర యూనిట్ అంటే నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్, కీర్తి సురేష్ ల పేరు హాట్ టాపిక్ గా మారాయి. ఘన విజయం సాధించిన ఈ సినిమా కీర్తి సురేష్ తో పాటు మేకర్స్ కి మంచి ప్రశంసలు దక్కాయి. సినిమాని అద్భుతంగా తెరకెకించిన నాగి ని సినిమా ఇండస్ట్రీ మొత్తం అభినందించారు. 

 

అలా అభినందించిన వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండటం విశేషం. మహానటి సినిమా చూశాక ఎంతో ఉగ్వేగానికి లోనైన మెగాస్టార్ నాగ్ అశ్విన్ ని ఇంటికి పిలిపంచుకొని మరీ అభినందించారు. అంతేకాదు ఈ సినిమా ఎలా తీశావు ..అసలు సావిత్రి మందు తాగుతున్నట్టు చూపించాలని నీకు ఎందుకు అనిపించిందని ఆరా తీసి పేశంసించారు. అంతేకాదు ఆయన మేకింగ్ కి ఇంప్రెస్ అయిన మెగాస్టార్ మంచి స్క్రిప్ట్ సిద్దం చేస్తే మనం సినిమా చేద్దాం అంటూ ఆ క్షణమే మాటిచారు. దాంతో అప్పటి నుంచి నాగ్ అశ్విన్ సైలెంట్ గా మెగాస్టార్ బయోపిక్ తీయడానికి రీసెర్చ్ చేస్తూ కథ సిద్దం చేస్తున్నాడట. కథ మొత్తం కంప్లీటై ఒకే అయితే   2021 లో సెట్స్ మీదకి తీసుకురావాలని నాగీ సనాహాలు చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో చిరంజీవిగా ఆయన తనయుడు రాం చరణ్ నటించబోతున్నాడని అంటున్నారు. దీనిపై అధికారకంగా వెల్లడి కావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: