మామూలుగా వాలెంటైన్స్ డే అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది అదే మనసులోని భావాలను షేర్ చేసుకోవడం.. అందుకే ఆ రోజు చాలా ప్రత్యేంగా ప్రేమికులు జరుపుకుంటారు.. ఇకపోతే ఓ స్టార్ హీరోయిన్ కు ఈరోజున ఎదో గుర్తుకొస్తుంది అని అంటుంది.. అసలు విషయానికొస్తే ఆమెకు అంతగా ఏమి గుర్తుకు వస్తుంది అన్న విషయాలను తెలుసుకుందాం.. 

 

 

ఘటన గుర్తు కొస్తుందని  ప్రేమమ్‌ సినిమా నటి మడోనా సెబాస్టియన్‌ ఓ ఆసక్తికర కథను చెప్పింది. తాను బడిలో చదువుకుంటున్న రోజుల్లో తన క్లాస్‌లో ఓ విద్యార్థి పక్క తరగతిలో చదువుకుంటున్న అమ్మాయిని ప్రేమించాడని తెలిపింది.అతను ఆమెకు చేసిన పనులు అలాగే ఆమెకు ఇచ్చిన గిఫ్టులు చూసి తాను షాక్ గురవుతూ వస్తుందట... అప్పుడు ప్రేమ అంటే ఇలానే గిఫ్టులు ఇచ్చి పుచ్చుకోవడం అని అనుకొని షాక్ అయిందట..

 

 

ఇద్దరూ చూసుకునే వారని కాని మాట్లాడుకునే వారు కాదని చెప్పింది. దీంతో మేమంతా ప్రేమికులరోజున కలుసుకుని ప్రేమను వ్యక్తం చేసుకోవాలని వారిద్దరికీ చెప్పి, ఒప్పించామని తెలిపింది. వారిద్దరినీ ఒక హోటల్‌కు తీసుకెళ్లామని, మాట్లాడుకోవాలని చెప్పామని వివరించింది. అయితే, వారు ప్రేమ గురించి చెప్పుకోకుండా తిన్నావా? ఈ మధ్య ఏ సినిమా చూశావు? అనే మాటలు మాట్లాడుతుకున్నారని చెప్పింది...ఎం తిన్నావ్ అంటూ వారు మాట్లాడుకోవడం నాకు సిగ్గేసింది అంటూ ఆమె అంది...

 

 

అలా ఎన్ని మాట్లాడుకున్న కూడా  అది కేవలం మాటల వరకే ఉన్నదేదట.. చాలా సేపు మాట్లాకపోయినా కళ్ళతో చూసుకునేవారని ఆమె చెప్పుకొచ్చింది..చివరకు వారిద్దరు తమ ప్రేమను బయటకు చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపింది. ప్రతి ఏడాది ప్రేమికుల రోజున తనకు ఈ ఘటనే గుర్తు కొస్తుందని మండొన ఇటీవల హాజరయిన ఓ ఇంటర్ వ్యూలో వెల్లడించింది..అది కూడా వాలెంటైన్స్ డే కాబట్టి ఆరోజు ఈమె చెప్పిన మాటలు అందరికీ ఆశ్చర్యానికి గురిచేశారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: